DK Shivakumar | మే 30న కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం : కాంగ్రెస్ వర్గాలు
DK Shivakumar | కర్ణాటక (Karnataka) నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మే 30న శనివారం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
DK Shivakumar | కర్ణాటకలో (Karnataka) ముఖ్యమంత్రి మార్పు కథ క్లైమాక్స్‌కు చేరింది. సీఎం సిద్ధరమయ్య (Siddaramaiah) తన పదవికి రేపు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మే 30న శనివారం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
నాయకత్వ మార్పు వేళ బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం కావేరిలో గురువారం ఉదయం సిద్ధరామయ్యతో డీకే కీలకమైన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న డీకే.. రేపు తెల్లవారుజామున బెంగళూరు చేరుకోనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బెంగళూరులో ల్యాండ్ కాగానే డీకే నేరుగా సీఎం సిద్ధూ నివాసానికి చేరుకుంటారని పేర్కొన్నాయి. ఈ భేటీ అనంతరం ఇద్దరు నేతలూ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్‌లో వాళ్లు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ తర్వాత సీఎం సిద్ధరామయ్య లోక్‌భవన్‌కు వెళ్లి రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించే అవకాశం ఉంది.
రాజ్యసభకు సిద్ధూ..
కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న `ముఖ్యమంత్రి మార్పు`పై కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీలో ఆరుగంటల పాటు సాగిన సమావేశం తర్వాత ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రణ్‌దీప్ సుర్జేవాలాతో పాటు సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో సిద్ధరామయ్య సీఎం పదవిని వదులుకొని, రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సహకరించాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.
ఆయనకు రాజ్యసభ స్థానంతోపాటు సభలో విపక్ష నేతగానూ అవకాశం ఇస్తామని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇప్పటికే తన అనుచరులతో చర్చించిన ఆయన హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినట్లు సమాచారం. ఇక డీకే నేతృత్వంలోని ప్రభుత్వంలో సిద్దరామయ్య వర్గాన్ని సమతుల్యం చేసేందుకు పలువురు ఉపముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను మంత్రులుగాను నియమించున్నారని తెలుస్తున్నది.
పవర్ షేరింగ్ ఫార్ములా..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన తర్వాత, సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య 'పవర్ షేరింగ్' (Power Sharing) ఒప్పందం జరిగిందని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోవడంతో, ఇక డీకేఎస్‌కు ఛాన్స్ దక్కుతుందని ఆయన మద్దతుదారులు గట్టిగా నమ్మారు. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత (Anti-incumbency) పెరుగుతోందని, ప్రియాంకా గాంధీ కూడా మార్పును కోరుకుంటున్నారని ప్రచారం జరగడంతో ఈ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Siddaramaiah | రేపు కర్ణాటక సీఎం రాజీనామా.. రాజ్యసభకు సిద్ధరమయ్య!
మే 27, 2026

Karnataka CM Change | కర్ణాటకలో సీఎం మార్పు లేనట్టే! ఢిల్లీ భేటీలో అసలు ఏం జరిగిందంటే? కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ
మే 26, 2026

Siddaramaiah vs DK Shivakumar | కర్ణాటక కాంగ్రెస్‌లో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’.. కొత్త సీఎంగా డీకే శివకుమార్? హైకమాండ్ ప్లాన్ ఇదే
మే 26, 2026
తాజావార్తలు
- ●Balka Suman | బాల్క సుమన్‌తో బీఆర్ఎస్కు తిప్పలు
- ●Saumitra Khan | కమలంపార్టీలోకి 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు..? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- ●L-Carnitine | ఎల్-కార్నిటైన్ సప్లిమెంట్లు నిజంగానే బరువును తగ్గిస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
- ●Chanagani Dayakar | సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర బాల్క సుమన్‌ది : చనగాని దయాకర్
- ●Assam UCC Bill | అస్సాంలో ఉమ్మడి పౌర స్మృతికి గ్రీన్ సిగ్నల్: లివ్-ఇన్ జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. లేదంటే జైలే!
- ●Gold | బంగారం ప్రియం.. అయినా తగ్గని కొనుగోళ్లు..

Balka Suman | బాల్క సుమన్‌తో బీఆర్ఎస్కు తిప్పలు

Saumitra Khan | కమలంపార్టీలోకి 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు..? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

L-Carnitine | ఎల్-కార్నిటైన్ సప్లిమెంట్లు నిజంగానే బరువును తగ్గిస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?

Chanagani Dayakar | సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర బాల్క సుమన్‌ది : చనగాని దయాకర్



