త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mamata Banerjee | బెంగాల్ విజ‌యం త‌ర్వాత‌.. ఢీల్లీని హ‌స్త‌గ‌తం చేసుకుంటా.. బీజేపీని త‌రిమికొడ‌తా : మ‌మ‌తా బెన‌ర్జీ

Mamata Banerjee | బెంగాల్‌లో బీజేపీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి (West Bengal CM) మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మ‌రోసారి త‌మ పార్టీ జెండా ఎగురువేస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. బెంగాల్ విజ‌యం త‌ర్వాత ఢిల్లీని టేకోవ‌ర్ చేసుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. హ‌స్తిన‌లో బీజేపీని గ‌ద్దెదించుతానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

D

National | Published On Apr 24, 2026, 1.44 pm IST

Mamata Banerjee | బెంగాల్ విజ‌యం త‌ర్వాత‌.. ఢీల్లీని హ‌స్త‌గ‌తం చేసుకుంటా.. బీజేపీని త‌రిమికొడ‌తా : మ‌మ‌తా బెన‌ర్జీ
Advertisement
  • బీజేపీ ప‌త‌నాన్ని కోరుకుంటున్నా
  • బెంగాల్‌లో వారికి ఓట‌మి త‌ప్ప‌దు
  • న‌న్ను ఓడించే స‌త్తా ఎవ‌రికీ లేదు

Mamata Banerjee | అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌శ్చిమ బెంగాల్ ర‌ణ‌రంగాన్ని త‌ల‌పిస్తోంది. బీజేపీ, అధికార తృణ‌మూల్ మ‌ధ్య హోరాహోరీ నెల‌కొంది. ఇరు పార్టీలూ గెలుపే ల‌క్ష్యంగా దూకుడు పెంచాయి. ఇరు పార్టీల నేత‌లు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో బెంగాల్ ముఖ్య‌మంత్రి (West Bengal CM) మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee) తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత త‌న దృష్టిని ఢిల్లీపై మ‌ళ్లిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

కోల్‌క‌తాలోని చౌరంగీ (Chowringhee) ప్రాంతంలో జ‌రిగిన ర్యాలీలో దీదీ ప్ర‌సంగిస్తూ.. ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నింటినీ ఏకం చేసి కేంద్రంలోని బీజేపీని ముక్క‌లు చేస్తానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. "బెంగాల్‌లో విజయం సాధించిన తర్వాత.. ఢిల్లీపై దృష్టిపెడ‌తా. ఢిల్లీని హ‌స్త‌గ‌తం చేసుకుంటా. అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఏకం చేసి ఢిల్లీలో బీజేపీని గ‌ద్దెదించుతా" అని దీదీ వ్యాఖ్యానించారు. త‌నకు ప‌ద‌వులు, అధికారంపై ఆశ లేద‌ని ఈ సంద‌ర్భంగా మ‌మ‌త స్ప‌ష్టం చేశారు. రాజ‌ధానిలో బీజేపీ ప‌త‌నాన్ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. బెంగాల్‌లో వారికి ఓట‌మి త‌ప్ప‌దు.. అలాగే ఢిల్లీలో కూడా బీజేపీని త‌రిమికొట్టాలి అని దీదీ ధ్వ‌జ‌మెత్తారు.

అంతేకాదు, బీజేపీ కోసం ప‌నిచేస్తున్న అధికారులు, ఆ పార్టీ కార్య‌కర్త‌ల‌పై మ‌మ‌త ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీకి బ్రోకర్లుగా వ్యవహరిస్తున్న ప్ర‌తీ ఒక్క‌రి పేర్లు నోట్ చేసుకున్న‌ట్లు చెప్పారు. ఆ పార్టీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ల‌ను అధికారులుగా నియ‌మించుకున్నార‌ని ఆరోపించారు. అయినా త‌మ‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని దీదీ వ్యాఖ్యానించారు. "న‌న్ను ఓడించే స‌త్తా ఎవ‌రికీ లేదు. గుర్తు పెట్టుకోండి. బెంగాల్ గ‌డ్డ‌పై మ‌రోసారి జెండా ఎగుర‌వేస్తా. ఆ త‌ర్వాత ఢిల్లీపై దండెత్తుతా. బీజేపీని గ‌ద్దె దించుతా" అని మ‌మ‌తా తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు.

Also Read..

దీదీ దిగిపోయే స‌మ‌యం వ‌చ్చింది.. బెంగాల్‌లో బీజేపీ గెలుపు ఖాయం : అమిత్ షా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన క్రూడాయిల్‌ ధరలు

బీజేపీలో చేర‌డం లేదు.. ఈ ప్ర‌చారాన్ని ఇంత‌టితో ఆపండి: ప్రీతిరెడ్డి

Advertisement
Advertisement