Preethi Reddy meets Chandrashekar Thiwari | బీజేపీలో చేరడం లేదు.. ఈ ప్రచారాన్ని ఇంతటితో ఆపండి: ప్రీతిరెడ్డి
Preethi Reddy meets Chandrashekar Thiwari | త్రినేత్ర.న్యూస్: మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ(BJP)లో చేరతారన్న వార్తలు ఊపందుకున్న వేళ ఆమె వాటికి తెర దించారు. తాను ఆ ఏ పార్టీలో చేరడం లేదని చెప్పారు. ఏఐ క్యాంపస్(AI campus) ఓపెనింగ్‌కు ప్రధాని మోదీ(PM Modi)ని ఆహ్వానించామని.. అందుకే ఆ పార్టీ నేతలను ఇప్పుడు కలుస్తున్నామని తెలిపారు.
Preethi Reddy meets Chandrashekar Thiwari | త్రినేత్ర.న్యూస్: మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ(BJP)లో చేరతారన్న వార్తలు ఊపందుకున్న వేళ ఆమె వాటికి తెర దించారు. తాను ఆ ఏ పార్టీలో చేరడం లేదని చెప్పారు. ఏఐ క్యాంపస్(AI campus) ఓపెనింగ్‌కు ప్రధాని మోదీ(PM Modi)ని ఆహ్వానించామని.. అందుకే ఆ పార్టీ నేతలను ఇప్పుడు కలుస్తున్నామని తెలిపారు. బీజేపీనే కాకుండా అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.
శ్రీధర్‌బాబును కూడా కలిశాం..
ప్రీతిరెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పిస్తూ బీజేపీ పార్టీ విధానాలపై సానుకూలంగా మాట్లాడారు. దీంతో ఆమె బీజేపీలో చేరుతున్నారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు తెర లేపింది. ఈ ఊహాగానాల మధ్య శుక్రవారం ప్రీతిరెడ్డి బీజేపీ పార్టీ ఆఫీస్‌కు వెళ్లడం, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి(Chandrashekar Thiwari)ని కలవడంతో ఆ పార్టీలో చేరడం పక్కా అని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నేను బీజేపీలో చేరడం లేదు. ఈ కార్యక్రమం కోసం ఇటీవలే మంత్రి శ్రీధర్‌బాబును కూడా కలిశాం. దయ చేసి ఈ ప్రచారాన్ని ఇంతటితో ఆపండి. ఇది మర్యాదపూర్వక భేటీయే అని ఆమె వెల్లడించారు.
మల్లారెడ్డి ఇటీవల కుటుంబంతో సహా ప్రధాని మోదీని కలిశారు. దీంతో ఆయన కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా నడిచింది. ఈ కథనాలపై మల్లారెడ్డి రియాక్ట్ అయ్యారు. త్వరలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీలో దేశంలోనే మొదటి డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్‌ను గూగుల్‌తో కలిసి ప్రారంభించబోతున్నామని చెప్పారు. అందుకే ప్రధాని నరేంద్రమోదీని ఆ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు మల్లారెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



