త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay TVK Cabinet | తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్: 59 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వంలోకి కాంగ్రెస్.. సీఎం విజయ్ క్యాబినెట్‌లో ఇద్దరికి ఛాన్స్

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం! దాదాపు 59 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలోకి అడుగుపెడుతోంది. విజయ్ క్యాబినెట్‌లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చోటు దక్కనుంది.

J

National | Published On May 20, 2026, 10.30 pm IST

Vijay TVK Cabinet | తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్: 59 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వంలోకి కాంగ్రెస్.. సీఎం విజయ్ క్యాబినెట్‌లో ఇద్దరికి ఛాన్స్
Advertisement

Vijay TVK Cabinet | త్రినేత్ర.న్యూస్ : ద్రావిడ పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఆరు దశాబ్దాల (59 ఏళ్లు) సుదీర్ఘ విరామం తర్వాత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరిగి అధికారంలో భాగస్వామి కాబోతోంది. గురువారం జరగనున్న ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) క్యాబినెట్ విస్తరణలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ ఒక "చారిత్రక ఘట్టం"గా అభివర్ణించింది.

మంత్రులుగా రాజేష్ కుమార్, విశ్వనాథన్

కాంగ్రెస్ పార్టీకి ఇది నిజంగా ఒక పండగ లాంటి రోజని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ (KC Venugopal) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంగీకారంతో ఎమ్మెల్యేలు అడ్వకేట్ రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్‌లు తమిళనాడు క్యాబినెట్‌లో చేరబోతున్నారని ఆయన ప్రకటించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విజన్ ప్రకారం ప్రజల సంక్షేమం కోసం వీరు అద్భుతంగా పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

డీఎంకే కు షాక్.. విజయ్‌తో ఫ్రెండ్‌షిప్

ఒక దశాబ్దానికి పైగా డీఎంకే (DMK) తో పొత్తులో ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌కు ఏనాడూ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం దక్కలేదు. కనీసం తాజా ఎన్నికల ముందు కూడా క్యాబినెట్ బెర్తులు ఇవ్వాలని కాంగ్రెస్ అడిగినా డీఎంకే పెద్దగా పట్టించుకోలేదు. వాళ్లు అడిగిన 41 సీట్లకు బదులు కేవలం 20కి పైగా సీట్లు మాత్రమే ఇచ్చేందుకు డీఎంకే మొగ్గు చూపింది. అదే సమయంలో బ్యాక్-ఛానల్ (back-channel) చర్చల ద్వారా విజయ్ ఏకంగా 70 సీట్లు ఆఫర్ చేశారు. చివరకు డీఎంకేతో తెగదెంపులు చేసుకున్న కాంగ్రెస్, తను పోటీ చేసిన 27 సీట్లలో 5 చోట్ల గెలిచి, విజయ్‌ పార్టీకి మద్దతు పలికింది.

మిగతా మిత్రపక్షాలకు కూడా టీవీకే ఆహ్వానం

తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో ఆగిపోయిన అధికార టీవీకే (TVK) పార్టీ, తమకు మద్దతిచ్చిన ఇతర మిత్రపక్షాలను సైతం ప్రభుత్వంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది. వీసీకే (VCK) నేత తొల్ తిరుమావళవన్, అలాగే ఐయూఎంఎల్ (IUML) నాయకులు కూడా మంత్రి మండలిలో చేరాలని, ఇది ముఖ్యమంత్రి విజయ్ కోరిక అని రాష్ట్ర పబ్లిక్ వర్క్స్, క్రీడల శాఖ మంత్రి ఆదవ్ అర్జున మీడియాకు వెల్లడించారు. అయితే లెఫ్ట్ పార్టీలు (CPI, CPM) మాత్రం ప్రభుత్వానికి బయట నుంచి (outside support) మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోగా, వారి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు అధికార పార్టీ స్పష్టం చేసింది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత పవర్‌లోకి వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ మార్క్ ఎలా చూపిస్తారో చూడాలి మరి.

Advertisement
Advertisement