HPCL | హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాల భర్తీ.. 116 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్
HPCL | మీరు ఇంజినీరింగ్( Engineering ), సైన్స్ డిగ్రీ( Science Degree ) పూర్తి చేశారా..? ప్రభుత్వ ఉద్యోగం( Govt Job ) కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీ లాంటి వారి కోసమే హెచ్‌పీసీఎల్( HPCL ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
HPCL | త్రినేత్ర.న్యూస్ : ఇంజినీరింగ్( Engineering ), సైన్స్ డిగ్రీ( Science Degree ) పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్( HPCL ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 116 జూనియర్ ఎగ్జిక్యూటివ్( Junior Excutive ) పోస్టులను భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్ డిప్లొమా/ డిగ్రీ/ ఎంబీఏ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఆయా పోస్టును బట్టి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)/ రాత పరీక్ష, గ్రూప్ టాస్క్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, స్కిల్ టెస్టు, పర్సనల్/ టెక్నికల్ ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు. మొత్తం ఉద్యోగాల్లో 62 పోస్టులకు ఉద్యోగానుభవం అవసరమవుతుంది. 54 పోస్టులకు మాత్రం ఫ్రెషర్లూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ - కెమికల్
ఖాళీలు: 37
అర్హత: 65 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం) రెగ్యులర్ ఇంజినీరింగ్ డిప్లొమా (కెమికల్).
వయసు: 25 సంవత్సరాలు మించకూడదు.
పోస్టు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ - ఫైర్ అండ్ సేఫ్టీ
ఖాళీలు: 17
అర్హత: 65 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం) సైన్స్ డిగ్రీ. ఫైర్ అండ్ సేఫ్టీ డిప్లొమా, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయసు: 25 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: పోస్టు ప్రకారం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)/ రాత పరీక్ష, గ్రూప్ టాస్క్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, స్కిల్ టెస్టు, పర్సనల్/ టెక్నికల్ ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు.
ముఖ్యాంశాలు
వయసు: 25 సంవత్సరాలు మించకూడదు. ప్రత్యేక వర్గాలకు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: అన్‌రిజర్వుడ్, ఓబీసీ-ఎన్‌సీఎల్, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1180 (దరఖాస్తు ఫీజు రూ.1000 + జీఎస్టీ రూ.180). ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు ఉండదు.
వేతన శ్రేణి: నెలకు రూ.30,000 - 1,20,000. మూల వేతనానికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, పదవీ విరమణ ప్రయోజనాలూ ఉంటాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.07.2026
వెబ్‌సైట్: http://www.hindustanpetroleum.com/
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Earthquake | విశాఖ నగరంలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు
- ●Lion | 11 ఏళ్ల బాలుడిని చంపిన సింహాం.. ఆపై మృగరాజుకు వాంతులు
- ●Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి వారు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు..!
- ●Horoscope | జూలై 12 రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి..!
- ●Hyderabad Traffic Police Special Drive | హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ఆ తప్పులు చేస్తే భారీ ఫైన్ తప్పదు!
- ●Ashwini Vaishnaw | హైదరాబాద్‌లో 3 బుల్లెట్ రైలు కారిడార్లు

Earthquake | విశాఖ నగరంలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

Lion | 11 ఏళ్ల బాలుడిని చంపిన సింహాం.. ఆపై మృగరాజుకు వాంతులు

Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి వారు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు..!

Horoscope | జూలై 12 రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి..!






