త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pension Benefits | ఆ ఎమ్మెల్యేల‌కు పెన్ష‌న్ క‌ట్‌.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Pension Benefits | రాజ‌కీయ నాయ‌కులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో వారికి తెలియ‌దు. ప్ర‌జాప్ర‌తినిధుల గురించి అస‌లే చెప్పొద్దు. ఇక ఎమ్మెల్యేల (MLAs) సంగ‌తి అంటారా?.. స్వార్ధ ప్ర‌యోజ‌నాలు, ప‌ద‌వుల కోసం అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తుంటారు.

G

National | Published On Apr 3, 2026, 10.21 am IST

Pension Benefits | ఆ ఎమ్మెల్యేల‌కు పెన్ష‌న్ క‌ట్‌.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Advertisement

Pension Benefits | త్రినేత్ర‌.న్యూస్‌: రాజ‌కీయ నాయ‌కులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో వారికి తెలియ‌దు. ప్ర‌జాప్ర‌తినిధుల గురించి అస‌లే చెప్పొద్దు. ఇక ఎమ్మెల్యేల (MLAs) సంగ‌తి అంటారా?.. స్వార్ధ ప్ర‌యోజ‌నాలు, ప‌ద‌వుల కోసం అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తుంటారు. ఈ ఎన్నిక స‌మ‌యంలో ఒక పార్టీలో ఉంటారు. మ‌ళ్లీ ఎల‌క్ష‌న్ల నాటికి ఎన్ని రంగుల మారుతాయో?.. ఇలా ఒక పార్టీ గుర్తుపై గెలిగి మ‌రో పార్టీ తీర్థం పుచ్చుకోవాల‌నుకునే ఎమ్మెల్యేల‌కు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ (Himachal Pradesh) ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. పార్టీ మారి అన‌ర్హ‌త‌కు గుర‌య్యే ఎమ్మెల్యేల‌కు పెన్ష‌న్ ప్ర‌యోజ‌నాలు (Pension Benefits) వ‌ర్తించకుండా చేసింది. దీనికి సంబంధించిన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది.

బ‌డ్జెట్ స‌మావేశాల చివ‌రిరోజున పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటింబ‌డిన‌ శాసనసభ్యులకు పింఛను ప్రయోజనాలను నిరాకరించే బిల్లును సీఎం సుఖ్వింద‌ర్ సింగ్ సుఖు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ చ‌ట్ట స‌ర‌వ‌ణ‌ బిల్లును స‌భ‌ ఆమోదించింది. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ ఫిరాయింపులను నిరోదించేందుకు ప్రస్తుతం అమ‌లులో ఉన్న‌ చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవన్నారు. ప్రజా తీర్పును పరిరక్షించడం, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడం, ఫిరాయింపులను అరికట్టడలో భాగంగానే ఈ సవరణ బిల్లును తీసుకొచ్చామ‌ని చెప్పారు. ప్రజాస్వామ్యం అమ్ముడుపోకుండా చూడటమే దీని ఉద్దేశమ‌ని తెలిపారు.

కాగా, దీనిపై బీజేపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇది రాజ‌కీయ ప్రేరేపిత‌మైన‌ద‌ని విమ‌ర్శించింది. ఇలాంటి సవరణనే గతంలోనూ తీసుకువచ్చారని, అయితే దానికి ఆమోదం లభించలేదని విపక్ష నేత జై రామ్ ఠాకూర్ అన్నారు. ఇప్పుడు దీనిని తిరిగి ప్రవేశపెట్టడం వెనుక ఉద్దేశం ఏంట‌ని ప్రశ్నించారు. ప్రభుత్వం కొందరు నిర్దిష్ట వ్యక్తులను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఎమ్మెల్యేలందరికీ పెన్షన్లు తొలగించాలన్న గత ప్రతిపాదనకు ఆమోదం లభించలేదని, ప్రస్తుత బిల్లు ఇద్దరు మాజీ శాసనసభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని చెప్పారు.

Advertisement
Advertisement