Himachal Pradesh | హిమాచల్‌లో వర్ష బీభత్సం.. 157 మంది మృతి
Himachal Pradesh | హిల్‌స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను భారీ వర్షాలు (Heavy rains) అతలాకుతలం చేస్తున్నాయి. క్లౌడ్‌బరస్ట్, ఆకస్మిక వరదలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 157 మంది మరణించారు. 257 మంది ఆచూకీ గల్లంతైంది.
Himachal Pradesh | త్రినేత్ర.న్యూస్ : హిల్‌స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను భారీ వర్షాలు (Heavy rains) అతలాకుతలం చేస్తున్నాయి. క్లౌడ్‌బరస్ట్, ఆకస్మిక వరదలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. రుతుపవనాలు (monsoon fury) ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.
జూన్ 30 నుంచి ఆగస్టు 9 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 157 మంది మరణించారు. అందులో వర్షం కారణంగా సంభవించిన ప్రమాదాలు.. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, క్లౌడ్‌బరస్ట్‌లు, ఇళ్లు కూలిపోవడం, నీటిలో మునిగిపోవడం, విద్యుత్ షాక్ వంటి ప్రమాదాల కారణంగా 68 మంది మరణించగా.. రోడ్డు ప్రమాదాల్లో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 257 మంది ఆచూకీ గల్లంతైంది. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా ఆస్తులు దెబ్బతిన్నాయి. దీనివల్ల సుమారు రూ.900 కోట్ల నష్టం వాటిల్లిందని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (SEOC) తాజా నివేదిక వెల్లడించింది.
విద్యుత్ సరఫరాకు అంతరాయం..
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండి (Mandi), కులు (Kullu) జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సుమారు 161 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (DTR) వారం రోజులకు పైగా పనిచేయడం లేదు. వీటిలో అత్యధికంగా మండిలో 77, సిమ్లాలో 43, కులులో 40 ఉన్నాయి. ఇక ఈ భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు ప్రమాదకరస్థాయిలో పొంగి పొర్లుతున్నాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. విద్యుత్, నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి.
259 రోడ్లు బ్లాక్
పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడటం వల్ల మండి-కులు హైవే సహా దాదాపు 259 రోడ్లు బ్లాక్ అయ్యాయి. ఇందులో మండి జిల్లాలో 120, చంబాలో 42, కులులో 40, సిమ్లాలో 30 రోడ్లు ఉన్నాయి. బ్లాక్ అయిన రోడ్లను తెరిచేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికలు..
ఇదిలా ఉండగా.. కాంగ్రా, మండి, హమీర్‌పూర్, సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సిమ్లాలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చంబా, కులు, సోలన్, బిలాస్‌పూర్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Also Read..
తాజావార్తలు
- ●KBR Park | వాహనదారులరా బీ అలర్ట్.. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే
- ●RanaBaali | రణబాలి వాయిదా - రష్మికనే కారణమా ? - కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!
- ●Polymer Notes | రూ.10, రూ.20 పాలిమర్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
- ●CM Vijay | త్రిషను డిప్యూటీ సీఎం ఎప్పుడు చేస్తారు.. సీఎం విజయ్‌పై దాడికి నటి పేరును అస్త్రంగా వాడుకుంటున్న ప్రతిపక్షాలు
- ●NASA ISRO Moon Base | చంద్రుడిపై మనుషులు నివసించేలా 'మూన్ బేస్' నిర్మిస్తున్న నాసా.. కలిసి పనిచేద్దాం రండి: ఇస్రోకు ఆహ్వానం
- ●Vaddiraju Ravichandra | ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు సంస్కరణలు ఓకే.. కానీ సరిగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుంది

KBR Park | వాహనదారులరా బీ అలర్ట్.. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే

RanaBaali | రణబాలి వాయిదా - రష్మికనే కారణమా ? - కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!

Polymer Notes | రూ.10, రూ.20 పాలిమర్ నోట్ల ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

CM Vijay | త్రిషను డిప్యూటీ సీఎం ఎప్పుడు చేస్తారు.. సీఎం విజయ్‌పై దాడికి నటి పేరును అస్త్రంగా వాడుకుంటున్న ప్రతిపక్షాలు






