Heavy Rains | ఈ మూడు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..!
Heavy Rains | తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
Heavy Rains | తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
ఇక ఆదిలాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఆయా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పింది. శనివారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. ఆదివారం, సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ, వరంగల్, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు అక్కడక్కడ పలుచోట్ల మోస్తరు వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో 9 సెంటీమీటర్లు వర్షాపాతం నమోదైందని టీజీ డీపీఎస్ పేర్కొంది. జక్రాన్‌పల్లిలో 7.5, డిచ్‌పల్లిల్లో 6.8, భీమ్‌గల్‌లో 6.8, ధర్పల్లిలో 7.8. సిరికొండలో 7.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 6.8, ఎల్లారెడ్డిపేటలో 6.9, ముస్తాబాద్ మండలం ఆవునూరులో 7.3, సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో 7.5, రాఘవపూర్‌లో 7.4, సిద్దిపేట జిల్లా కేంద్రంలో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ

Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం

S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు





