KBR Park | వాహనదారులారా బీ అలర్ట్.. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే
KBR Park | హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు( KBR Park ) చుట్టూ అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే అమలు చేయనున్నట్లు నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
ఏడాదిన్నర పాటు ట్రాఫిక్ ఆంక్షలు
KBR Park | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు( KBR Park ) చుట్టూ అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ నెల 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే అమలు చేయనున్నట్లు నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఈ వన్ వే కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు. సుమారు ఏడాదిన్నర పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. గతంలో నిర్వహించిన రెండు ట్రయల్ రన్‌ల సందర్భంగా సహకరించినట్టే.. 18 నుంచి కూడా సహకరించాలన్నారు.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే రోడ్డుకు వన్ వే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వన్ వే అమలులో ఉంటుందని చేశారు. ఎన్‌ఎఫ్‌సీఎల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనదారులను పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ వన్ వేను అమలు చేయాలని ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
తాజావార్తలు
- ●OPPO F35 | రూ.38,999కే ఒప్పో ఎఫ్35.. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..
- ●IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్లపై అదనపు భారం..
- ●Harish Rao | పల్లినూనె 210, ఎల్లిపాయ 240.. ఇలా ధరలు పెరిగితే సామాన్యుడెలా బతకాలి?
- ●CEC Gyanesh Kumar | జ్ఞానేశ్ను తొలగించలేం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
- ●Maddirala Rocireddy Arrest | బోగస్ పత్రాలతో ఘరానా మోసం.. ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మద్దిరాల రోసిరెడ్డి అరెస్ట్
- ●Maruti Suzuki | మారుతి షేర్లకు భారీ కరెక్షన్.. 34 శాతం పతనం తర్వాత మళ్లీ పుంజుకుంటుందా?

OPPO F35 | రూ.38,999కే ఒప్పో ఎఫ్35.. 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..

IndiGo | ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్లపై అదనపు భారం..

Harish Rao | పల్లినూనె 210, ఎల్లిపాయ 240.. ఇలా ధరలు పెరిగితే సామాన్యుడెలా బతకాలి?

CEC Gyanesh Kumar | జ్ఞానేశ్ను తొలగించలేం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు






