త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RanaBaali | ర‌ణ‌బాలి వాయిదా – ర‌ష్మికనే కార‌ణ‌మా ? – కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ర‌ణ‌బాలి మూవీ వాయిదాప‌డ‌టం ఖాయ‌మైపోయింది. సెప్టెంబ‌ర్ 11న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రెండు నెల‌లు ఆల‌స్యంగా థియేట‌ర్ల‌లోకి రానుంద‌ని అంటున్నారు. కొత్త రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

N

Entertainment | Published On Aug 11, 2026, 4.54 pm IST

RanaBaali | ర‌ణ‌బాలి వాయిదా – ర‌ష్మికనే కార‌ణ‌మా ? – కొత్త రిలీజ్ డేట్ ఇదేనా!
Advertisement

RanaBaali | పెళ్లి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న ఫ‌స్ట్ టైమ్ జంట‌గా న‌టిస్తున్న మూవీ ర‌ణ‌బాలి. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రాయ‌ల‌సీమ‌లో ఆంగ్లేయుల‌ను ఎదురించి పోరాడిన ర‌ణ‌బాలి అనే యోధుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో విజ‌య్‌, ర‌ష్మిక రియ‌ల్ లైఫ్ పాత్ర‌ల్లోనే క‌నిపించ‌బోతున్నారు. భార్యాభ‌ర్త‌లుగా న‌టిస్తున్నారు.

షూటింగ్‌కు బ్రేకులు...

ర‌ణ‌బాలిని సెప్టెంబ‌ర్ 11న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చాలా రోజుల క్రిత‌మే మేక‌ర్స్ వెల్ల‌డించారు. చెప్పిన డేట్‌కే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తిచేస్తూ వ‌చ్చారు. అనుకోకుండా ర‌ష్మిక మంద‌న్న ప్ర‌మాదం బారిన ప‌డ‌టంతో ర‌ణ‌బాలి చిత్రీక‌ర‌ణ‌కు బ్రేకులు ప‌డ్డాయి. మైసా సాంగ్ షూటింగ్‌లో ర‌ష్మిక జారిప‌డ‌టంతో తుంటిభాగంలో గాయ‌మైంది. ఈ ప్ర‌మాదం కార‌ణంగా రెండు నెల‌ల పాటు సినిమాల‌కు దూర‌మైంది. సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి ర‌ష్మిక తిరిగి షూటింగ్‌ల‌ను మొద‌లుపెట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

కొత్త డేట్ ఇదేనా...

ర‌ష్మిక గాయం ఎఫెక్ట్ ర‌ణ‌బాలి రిలీజ్‌పై ప‌డింది. సెప్టెంబ‌ర్ 11న విడుద‌ల‌ కావాల్సిన ఈ మూవీ వాయిదాప‌డ‌టం ఖాయ‌మైపోయింది. చెప్పిన డేట్‌కు కాకుండా రెండు నెల‌లు ఆల‌స్యంగా ర‌ణ‌బాలి థియేట‌ర్ల‌లోకి రానుంద‌ని అంటున్నారు. అక్టోబ‌ర్ 30ని కొత్త విడుద‌ల తేదీగా మేక‌ర్స్ ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. దాదాపు ఇదే డేట్ ఫైన‌ల్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

జ‌య‌మ్మ పాత్ర‌లో...

ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో ర‌ణ‌బాలిగా విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపించ‌బోతుండ‌గా...అత‌డి భార్య జ‌య‌మ్మ పాత్ర‌ను ర‌ష్మిక మంద‌న్న పోషిస్తుంది. రెట్రో లుక్‌లో వీరిద్ద‌రు క‌నిపిస్తున్న ఫొటోల‌ను ఇటీవ‌ల మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హాలీవుడ్ న‌టుడు ఆర్నాల్ వోస్లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాకు సైరాట్ ఫేమ్ అజ‌య్ - అతుల్ మ్యూజిక్ అందిస్తున్నారు.

రౌడీ జ‌నార్ధ‌న‌...

ప్ర‌స్తుతం ర‌ణ‌బాలితో పాటు తెలుగులో రౌడీ జ‌నార్ధ‌న సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రోవైపు ర‌ణ‌బాలితో పాటు లేడీ ఓరియెంటెడ్ క‌థ‌తో ర‌ష్మిక మంద‌న్న మైసా సినిమా చేస్తుంది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement