త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MSI | ఎంఎస్‌ఐ బంప‌ర్ ఆఫ‌ర్‌.. హై ఎండ్ ల్యాప్ టాప్‌ల‌పై భారీ డిస్కౌంట్లు..

MSI | దేశంలో అధికారిక రిటైల్, ఆన్‌లైన్ ఛానళ్ల ద్వారా ఎంపిక చేసిన ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ఎంఎస్‌ఐ తన జూన్ ప్రమోషన్ 2026 క్యాంపెయిన్‌ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ప‌లు ల్యాప్ టాప్‌ల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు, రాయితీల‌ను అందిస్తున్నారు.

S

Technology | Published On Jun 16, 2026, 5.06 pm IST

MSI | ఎంఎస్‌ఐ బంప‌ర్ ఆఫ‌ర్‌.. హై ఎండ్ ల్యాప్ టాప్‌ల‌పై భారీ డిస్కౌంట్లు..
Advertisement

MSI | దేశంలో అధికారిక రిటైల్, ఆన్‌లైన్ ఛానళ్ల ద్వారా ఎంపిక చేసిన ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ఎంఎస్‌ఐ తన జూన్ ప్రమోషన్ 2026 క్యాంపెయిన్‌ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ప‌లు ల్యాప్ టాప్‌ల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు, రాయితీల‌ను అందిస్తున్నారు. గేమింగ్ ల్యాప్ టాప్స్ విభాగంలో క‌టానా 15 ఎక్స్ బి14డ‌బ్ల్యూఎఫ్‌కె-102ఐఎన్ మోడ‌ల్ ల్యాప్ టాప్‌ను రూ.1,51,990 ప్ర‌మోష‌న‌ల్ ధ‌ర‌కు అందుబాటులో ఉంచారు. క‌టానా 15 హెచ్ఎక్స్ బి14డ‌బ్ల్యూఈకె-104ఐఎన్ మోడ‌ల్ ల్యాప్ టాప్‌ను రూ.1,14,990కి అందిస్తున్నారు. క‌టానా 15 హెచ్‌ఎక్స్ బి14డ‌బ్ల్యూఈకె మోడల్ ల్యాప్ టాప్‌ను రూ.1,43,990 ధరకు అందుబాటులో ఉంచారు. క‌టానా ఎ15 ఎఐ బి8విఎఫ్‌-447ఇన్ మోడ‌ల్ రూ.1,34,990కి అందుబాటులో ఉండ‌గా, థిన్ 15 బి13యూడీఎక్స్‌-129ఇన్ మోడ‌ల్ రూ.80,990కి ల‌భిస్తోంది. థిన్ 15 బి13యూసీ-125ఇన్ మోడ‌ల్‌ను త‌గ్గింపు అనంత‌రం రూ.82,990కి విక్ర‌యిస్తున్నారు.

ఏయే మోడ‌ల్స్‌పై..?

సైబోర్గ్ 15 బి2ఆర్‌డబ్ల్యూఎఫ్‌కేజీ-215ఇన్ మోడ‌ల్ రూ.1,22,990కి ల‌భిస్తుండ‌గా, సైబోర్గ్ 15 బి2ఆర్‌డ‌బ్ల్యూఈకేజీ-217ఇన్ రూ.99,990కి, క్రాస్ హెయిర్ 16 హెక్స్ ఏఐ మోడ‌ల్ రూ.1,89,990కి, రైడ‌ర్ 18 హెచ్ఎక్స్ రూ.3,99,990కి అందుబాటులో ఉన్నాయి. అలాగే టైటాన్ 18 హెచ్ఎక్స్ డ్రాగ‌న్ ఎడిష‌న్ నోర్స్ మైథ్ వేరియెంట్‌ను రూ.6,29,990కి అందుబాటులో ఉంచారు. ఇందులో ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెస‌ర్‌, ఆర్‌టీఎక్స్ 5090 24జీబీ జీపీయూ, 96జీబీ ర్యామ్‌, 2టీబీ ఎస్ఎస్‌డీ వంటి అత్యాధునిక ఫీచ‌ర్లు ఉన్నాయి. ఏఐ, ప్రొడ‌క్టివిటీ ల్యాప్ టాప్స్ విభాగంలో ప్రెస్టీజ్ 13 ఏఐ ప్ల‌స్ ఉకియోయే ఎడిష‌న్‌ను రూ.1,32,990కి ఇస్తున్నారు. ప్రెస్టీజ్ 14 ఏఐ ఈవో సీ1ఎంజీ మోడ‌ల్‌ను రూ.1,07,990కి, ప్రెస్టీజ్ 16 ఏఐ ఈవో బీ1ఎంజీ ల్యాప్ టాప్‌ను రూ.1,39,990కి ఇస్తున్నారు. మెయిన్‌స్ట్రీమ్ ల్యాప్‌టాప్ విభాగంలో మోడ్రన్ 14సి13ఎం మోడల్ ను రూ.69,990 ప్రమోషనల్ ధరకు అందుబాటులో ఉంచారు.

ఉచిత బ్యాక్ ప్యాక్‌..

ఆఫ్‌లైన్ ఛానల్ ఆఫర్లలో భాగంగా అర్హత కలిగిన మోడ్రన్ సిరీస్ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే కస్టమర్లకు ఒక సంవత్సరం ఉచిత వారంటీ పొడిగింపు అందిస్తారు. ఈ ఆఫర్‌కు మోడ్రన్ సిరీస్ మోడళ్లు వ‌ర్తిస్తాయి. ఎంఎస్‌ఐ అధికారిక రీసెల్లర్లు, క్రోమా, విజయ్ సేల్స్ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఎంఎస్‌ఐ బజాజ్ ఫిన్‌సర్వ్, పైన్‌ల్యాబ్స్ ద్వారా ఈఎంఐ సదుపాయాలను కూడా అందిస్తోంది. బజాజ్ ఫిన్‌సర్వ్ ద్వారా నో-కాస్ట్, లో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. పైన్‌ల్యాబ్స్ ద్వారా దీర్ఘ‌కాలిక‌ ఈఎంఐ ప్లాన్‌లు లభిస్తున్నాయి. ఎంఎస్‌ఐ అధికారిక రీసెల్లర్ల ద్వారా కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌లకు ఉచిత బ్యాక్‌ప్యాక్ కూడా అందిస్తోంది. కటానా, సైబోర్గ్, థిన్, మోడ్రన్ సిరీస్ మోడళ్ల‌కు ఉచితంగా బ్యాక్ ప్యాక్ ఇస్తున్నారు. అయితే ఎంఎస్‌ఐ జూన్ ప్రమోషన్ 2026 క్యాంపెయిన్ ప్రస్తుతం ఎంఎస్‌ఐ అధికారిక రీసెల్లర్లు, క్రోమా, విజయ్ సేల్స్ ద్వారా కొనసాగుతుండ‌గా, ఆఫ్‌లైన్ ఆఫర్లు జూన్ 30 వరకు అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌కు ప్రత్యేకమైన ఆన్‌లైన్ ఆఫర్లు జూన్ 20 నుంచి జూన్ 26 వరకు కొనసాగనున్నాయి.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement