త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NSUI Rally | నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీక్‌.. ట్యాంక్‌బండ్ వ‌ద్ద ఎన్ఎస్‌యూఐ భారీ ర్యాలీ

NSUI Rally | నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీక్‌, సీబీఎస్ఈ OSM కుంభ‌కోణం, SSC-GD నియామకాల్లో నెలకొన్న సమస్యలు, CUCET (Chandigarh University Common Entrance Test) ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో తీవ్ర జాప్యంపై ఎన్ఎస్‌యూఐ భ‌గ్గుమంది. ట్యాంక్ బండ్ వద్ద భారీ నిర‌స‌న ర్యాలీలో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొని పెద్దఎత్తున నినాదాలు చేశారు.

S

Hyderabad | Published On Jun 13, 2026, 5.46 pm IST

NSUI Rally | నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీక్‌.. ట్యాంక్‌బండ్ వ‌ద్ద ఎన్ఎస్‌యూఐ భారీ ర్యాలీ
Advertisement

NSUI Rally | త్రినేత్ర‌.న్యూస్‌: నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీక్‌, సీబీఎస్ఈ OSM కుంభ‌కోణం, SSC-GD నియామకాల్లో నెలకొన్న సమస్యలు, CUCET (Chandigarh University Common Entrance Test) ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో తీవ్ర జాప్యంపై ఎన్ఎస్‌యూఐ భ‌గ్గుమంది. తెలంగాణ ఎన్ఎస్‌యూఐ అధ్య‌క్షుడు వెంక‌ట్‌స్వామి ఆధ్వ‌ర్యంలో శ‌నివారం ట్యాంక్‌బండ్‌పై ట్యాంక్ బండ్ వద్ద "విద్యార్థి బచావో ఆందోళన్-చలో లోక్ భవన్" కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పీఎం మోదీకి వ్య‌తిరేకంగా ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు.

ఈ భారీ నిర‌స‌న ర్యాలీలో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొని పెద్దఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ నిర‌స‌న చేప‌ట్టారు. ఈ భారీ నిర‌స‌న‌తో ట్యాంక్‌బండ్ ప్రాంత ప‌రిస‌రాలు ద‌ద్ద‌రిల్లాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన‌గా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు బందోబ‌స్తు నిర్వ‌హించారు.

ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీ తీశారు. అఖిల భారత NSUI అధ్యక్షులు వినోద్ జాఖర్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ సచిన్ సావంత్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement