త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

heartbreaking | హృద‌య విదార‌కం.. అప్పుడే పుట్టిన బిడ్డ‌తో స్ట్రెచ‌ర్‌పై వ‌చ్చి భ‌ర్త‌కు క‌డ‌సారి వీడ్కోలు ప‌లికిన భార్య‌.. VIDEO

heartbreaking | మ‌హారాష్ట్ర (Maharastra)లో హృద‌య విదార‌క ఘ‌ట‌న చోటు చేసుకుంది. రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన త‌న భ‌ర్త‌కు భార్య అప్పుడే పుట్టిన బిడ్డ‌ను తీసుకుని స్ట్రెచ‌ర్‌పై భ‌ర్త‌కు క‌డ‌సారి వీడ్కోలు ప‌లికేందుకు వ‌చ్చింది.

D

National | Published On Feb 16, 2026, 2.14 pm IST

heartbreaking | హృద‌య విదార‌కం.. అప్పుడే పుట్టిన బిడ్డ‌తో స్ట్రెచ‌ర్‌పై వ‌చ్చి భ‌ర్త‌కు క‌డ‌సారి వీడ్కోలు ప‌లికిన భార్య‌.. VIDEO
Advertisement

heartbreaking | మ‌హారాష్ట్ర (Maharastra)లో హృద‌య విదార‌క ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌తారా (Satara) జిల్లాకు చెందిన ఓ ఆర్మీ జ‌వాన్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు. దీంతో అతని భార్య అప్పుడే పుట్టిన బిడ్డ‌ను తీసుకుని స్ట్రెచ‌ర్‌పై భ‌ర్త‌కు క‌డ‌సారి వీడ్కోలు ప‌లికేందుకు వ‌చ్చింది. ఈ దృశ్యం అక్క‌డున్న వారితో కంట‌త‌డి పెట్టించింది.

సతారాలోని దారే గ్రామానికి చెందిన హవల్దార్ ప్రమోద్ పరశురామ్ జాదవ్ (32) ఇండియ‌న్ ఆర్మీలో ప‌నిచేస్తున్నాడు. ప్ర‌స్తుతం లడఖ్‌లో ఉంటున్నాడు. అయితే, అత‌ని భార్య ప్ర‌స‌వం ఉండ‌టంతో సెల‌వుపై స్వ‌గ్రామానికి బ‌య‌ల్దేరాడు. ఈ క్ర‌మంలో మార్గం మ‌ధ్య‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో అత‌ను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో డెలివ‌రీ అయిన 8 గంట‌ల‌కే జాద‌వ్ భార్య త‌న న‌వ‌జాత శిశువుతోపాటూ స్ట్రెచ‌ర్‌పై వ‌చ్చి బ‌రువెక్కిన హృద‌యంతో భ‌ర్త‌కు క‌డ‌సారి వీడ్కోలు ప‌లికింది (heartbreaking final farewell). జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు ఇలా విషాదంగా మారడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ఈ హృద‌య విదార‌క దృశ్యం అక్క‌డున్న వారితో కంట‌త‌డి పెట్టించింది. ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఈ ఘ‌ట‌న గ‌త నెల చోటు చేసుకోగా.. వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

https://x.com/johny_kaki/status/2023015926824878426

Advertisement
Advertisement