Balka Suman | రైతుల అంశం డైవర్ట్ చేసేందుకే తుమ్మిడిహెట్టి పేరుతో కొత్త నాటకం
Balka Suman | రైతుల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే తుమ్మిడిహెట్టి పేరుతో డ్రామాలకు తెర తీశారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ఆరోపించారు.
- కాంగ్రెస్, బీజేపీ డ్రామాలో భాగమే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు
- మహారాష్ట్రతో మాట్లాడి ఏదో ఘనకార్యం చేసినట్టు మాట్లాడుతున్నరు
- తుమ్మిడిహెట్టి డీపీఆర్‌ను బయట పెట్టండి
- మేడిగడ్డ నుంచి నీళ్లు ఇవ్వకపోవడంలో కాంగ్రెస్‌కు ఎంత పాపముందో బీజేపీకీ అంతే ఉంది
- రేవంత్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
Balka Suman | త్రినేత్ర న్యూస్: రైతుల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే తుమ్మిడిహెట్టి పేరుతో డ్రామాలకు తెర తీశారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ఆరోపించారు. తుమ్మిడిహెట్టి (Thummidihetti) ప్రాజెక్ట్ విషయంలో డీపీఆర్ (DPR) ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఇవ్వకపోవడంలో కాంగ్రెస్‌కు ఎంత పాపముందే బీజేపీకీ అంతే ఉందన్నారు. వరి విత్తనాలు అమ్మే డీలర్లకు, పంటలు వేసే రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో నోటీసులిస్తూ భయపెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నిన్న ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఏదో గొప్పగా ఘనకార్యం సాధించినట్టుగా చెప్పారు. తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేసిన తీరును చూస్తే జాలేస్తుంది. ఈ చేతకాని అసమర్థ ప్రభుత్వం వల్ల పంటలు ఎండుతున్నాయి. ఉన్న నీటిని కిందికి వదిలి ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తుమ్మిడిహెట్టి దగ్గర బరాజ్ కడతాం అని చెప్తున్నారు. రాష్ట్రంలో కరెంట్ లేక, నీళ్లు అందక రైతులు అల్లాడుతుంటే ఇప్పుడు కొత్త నాటకానికి తెర లేపారు.
మా నియోజకవర్గంలో నీళ్ళు లేక, సరైన సమయంలో కరెంట్ రాక ట్యాంకర్లు తెచ్చి వరి పొలాలకు నీళ్ళు పోస్తున్నరు. రాష్ట్రంలో కరువుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. నిన్న మాజీ మంత్రి హరీశ్‌రావు తుమ్మిడిహెట్టి విషయంలో పూర్తి వివరాలు చెప్పారు. కానీ ప్రభుత్వంలోని మంత్రులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హరీశ్‌రావు, కేటీఆర్‌లను తిట్టడం తప్ప ఇంకోటి లేదు. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాల కాలమైంది.. ఇంకా మా మీద ఏడ్వడం ఎందుకు?
సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో రైతులను భయపెడుతున్నరు
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ లు ఆన్ చేస్తే ఆయా జిల్లాలకు నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉన్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు. వరి విత్తనాలు అమ్మొద్దని సీడ్ షాప్ లకు నోటీస్ లు ఇస్తున్నారు. మరోపక్క విత్తనాలు కొనే రైతులకు సైతం సెల్ఫ్ డిక్లరేషన్ పేరిట నోటీస్ లు ఇస్తున్నారు. ఇదీ ప్రభుత్వ తీరు.
రేవంత్ మీద జోక్‌లు..
కరోనా సమయంలో రేవంత్ రెడ్డి లేడని.. ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని సోషల్ మీడియాలో జోక్ లు వస్తున్నాయి. ఇవి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న డ్రామాలు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హడావుడిగా ఎన్డీఏస్ఏ రిపోర్ట్ వచ్చింది. రాష్ట్రంలో కరువు రూపుమాపేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేశారు. తుమ్మిడిహెట్టి దగ్గర బరాజ్ కట్టి ఇస్ట్ ఆదిలాబాద్ కు నీళ్ళు ఇస్తాం అని అంటున్నారు. మరి అక్కడ నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పింది. మరి నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయి? మీరు ప్రాజెక్ట్ కట్టండి కానీ ఆ ప్రాజెక్ట్ వల్ల ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తాయి.. ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలి.
కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ లో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తామో స్పష్టంగా ఉంది. కానీ మీరు తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ విషయంలో డీపీఆర్ బయటపెట్టండి. రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంటే ఎందుకు చోద్యం చూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగలు. బొగ్గు సరఫరా లేక విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. రైతు డిక్లరేషన్ ఇవ్వమని నిన్న మెట్‌పల్లిలో రైతులు ఆందోళన చేశారు. పాలమూరుకు నీళ్ళు రావు.. కానీ కుప్పంకు నీళ్ళు పోతున్నాయి. సీతారామకు ఎన్ని నీళ్ళు ఎత్తిపోశారు? అక్కడ ఎన్ని నీళ్ళు ఉన్నాయో వివరాలు ఇవ్వండి.
దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఎన్ని మోటర్లు ఆన్ చేశారు.. ఎన్ని నీళ్ళు లిఫ్ట్ చేశారని హరీశ్‌రావు నిన్న అడిగిన వివరాలు ఇవ్వండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్లు ఉంది రేవంత్ రెడ్డి తీరు. కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తి పోయకుండా కిందకు వదిలారు.
బీజేపీది విలన్ పాత్ర
మేడీగడ్డ విషయంలో ఎన్‌డీఎస్ఏను ఆగమేఘాల మీద పంపిన బీజేపీ ప్రభుత్వం.. మేడిగడ్డ రిపేరు విషయంలో ఎందుకు మాట్లాడదు? కాంగ్రెస్, బీజేపీ డ్రామాలో భాగమే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు. రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తూ బీజేపీ విలన్ పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ ఒకరికొకరు అలయ్ బలయ్ చేసుకుంటూ రాష్ట్రాన్ని పడావు పెడుతున్నారు. కరోనా సమయంలో కేసీఆర్ ప్రజలకు భరోసా కల్పించారు. రేవంత్ రెడ్డి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
మీ ఎమ్మెల్యేలే మీ మీద మాట్లాడుతున్నరంటే..
సెక్యూరిటీ లేకుండా కాంగ్రెస్ నేతలు రైతులకు వద్దకు వెళ్లే ధైర్యం ఉందా? కేసీఆర్ పొలాల చుట్టూ తిరిగిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతుల పొలాల దగ్గరకు పోతారా? సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిధులు ఇవ్వడం లేదు, నీళ్లు ఇవ్వడం లేదంటే రేవంత్ రెడ్డి పాలన ఎంత దుర్మార్గంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని బాల్క సుమన్ విమర్శించారు.
ఈ సమావేశంలో కె.కిశ్‌ర్ గౌడ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Chamala Kirankumar Reddy | కాళేశ్వరం గురించి మాట్లాడితే యమ కోపమొస్తది మీకు
- ●Rahul Gandhi | గర్భిణీ జర్నలిస్టును తోసేశారంటూ ఆరోపణలు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు
- ●CTI | 10 లక్షల మంది నిరసనకారులు, 20 వేల వాహనాలు.. నవంబర్ 1 ర్యాలీని వాయిదా వేసుకోండి
- ●Australia Visa | ఆస్ట్రేలియా వీసా రూల్స్‌లో మార్పులు.. భారతీయులకు బయోమెట్రిక్స్ తప్పనిసరి..
- ●Rahul Gandhi | ‘సత్యం శివం సుందరం’.. రాహుల్ గాంధీ ఆసక్తికర పోస్టు
- ●BTech student | స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి వెళ్తుండగా ప్రమాదం.. బీటెక్ విద్యార్థి దుర్మరణం

Chamala Kirankumar Reddy | కాళేశ్వరం గురించి మాట్లాడితే యమ కోపమొస్తది మీకు

Rahul Gandhi | గర్భిణీ జర్నలిస్టును తోసేశారంటూ ఆరోపణలు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు

CTI | 10 లక్షల మంది నిరసనకారులు, 20 వేల వాహనాలు.. నవంబర్ 1 ర్యాలీని వాయిదా వేసుకోండి

Australia Visa | ఆస్ట్రేలియా వీసా రూల్స్‌లో మార్పులు.. భారతీయులకు బయోమెట్రిక్స్ తప్పనిసరి..






