New Jobs | హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్‌లో ఉద్యోగాల వెళ్లువ.. నాలుగేండ్లలో కొత్తగా..
New Jobs | ఓవైపు ఐటీ రంగంలో లక్షల్లో ఉద్యోగాల కోత పడుతున్నది. ఎప్పుడు ఎవరిని తీసేస్తారో తెలియని పరిస్థితి. మరోవైపు హెల్త్‌కేర్ (Healthcare), ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో (Pharma Sector) క్రమంగా మానవ వనరులకు డిమాండ్ పెరుగుతున్నది.
New Jobs | త్రినేత్ర.న్యూస్: ఓవైపు ఐటీ రంగంలో లక్షల్లో ఉద్యోగాల కోత పడుతున్నది. ఎప్పుడు ఎవరిని తీసేస్తారో తెలియని పరిస్థితి. మరోవైపు హెల్త్‌కేర్ (Healthcare), ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో (Pharma Sector) క్రమంగా మానవ వనరులకు డిమాండ్ పెరుగుతున్నది. దీంతో ఈ రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు (New Jobs) రానున్నాయి. దేశంలో 2030 నాటికి కొత్తగా 20 నుంచి 25 లక్షల ఉద్యోగాలు రానున్నాయని ఓ అధ్యయం తెలిపింది. అదేవిధంగా 30 నుంచి 35 శాతం సిబ్బందికి కొత్త నైపుణ్యాలపై శిక్షణ అవసరం పడుతుందని సోమవారం విడుదలైన అడెకో నివేదిక వెల్లడించింది.
హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగాలు సామర్థ్య ఆధారిత వృద్ధి దశలోకి అడుగుపెట్టాయని పేర్కొంది. ఇందులో భాగంగా దవాఖానలు, ఆయుష్, హోమ్‌కేర్, వృద్ధుల సంరక్షణ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, డయాగ్నొస్టిక్స్, టెలి మెడిసిన్, క్లినికల్ పరిశోధన, ప్రజారోగ్యం వంటి విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నట్టు వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో విస్తరిస్తున్న ఈ రంగం వాటాపై వృద్ధి ఆధారపడి ఉంటుందని తెలిపింది. 2022లో జీడీపీలో 3.3 శాతంగా ఉన్న హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ వాటా 2030 నాటికి 5 శాతానికి చేరుతుందని నివేదిక అంచనావేసింది. ముఖ్యంగా క్లినికల్ పరిశోధనలు, డిజిటల్ హెల్త్‌కు ప్రాధాన్యం అధికమవడంతోపాటు ఔషధాల అభివృద్ధి, తయారీ కార్యకలాపాల అవుట్‌సోర్సింగ్‌కు అంతర్జాతీయంగా ప్రాముఖ్యం పెరగడం వంటివి వృద్ధికి తోడ్పడుతాయని తెలిపింది.
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో..
ప్రస్తుతం ఈ రంగంలో బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోనే ఎక్కువగా ఉద్యోగాలు ఉన్నప్పటికీ.. భవిష్యత్‌లో పుణె, అహ్మదాబాద్, కోయంబత్తూరు వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా అవకాశాలు విస్తరిస్తాయని వెల్లడించింది. ఈ నగరాల్లో దవాఖానలు క్రమంగా అధికమవుతుండటమే దీనికి కారణమని విశ్లేషించింది. ఇక డయాగ్నొస్టిక్స్, వ్యాధి నిరోధక ముందస్తు చెకప్‌లు, టెలిమెడిసిన్ విభాగాల్లో 20 నుంచి 25 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపింది.
అలాగే, కాంప్లెక్స్ జనరిక్స్, బయోలాజిక్స్, స్పెషాలిటీ చికిత్సలకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో.. అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి (R & D), నియంత్రణ పరమైన విభాగాల్లోనూ ఉద్యోగాలకు 25 నుంచి 30 శాతం మేర డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసింది. విదేశాల్లో కూడా భారతీయ నిపుణులకు డిమాండ్ భారీగా పెరుగుతుందని వెల్లడించింది. రానున్న 5 నుంచి ఏండు ఏండ్లలో ఇది 25 నుంచి 30 శాతానికి పెరిగే అవకాశం ఉందని చెప్పింది. ముఖ్యంగా మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియా, యూకే, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో భారతీయ వృత్తి నిపుణులకు డిమాండ్ ఉంటుందని అంచనా వేసింది.
సంబంధిత వార్తలు

ChatGPT For Doctors | ఇక వైద్యులకు అసిస్టెంట్‌గా చాట్‌జీపీటీ.. కొత్త టూల్‌ను లాంచ్ చేసిన ఓపెన్ఏఐ..
ఏప్రిల్ 25, 2026

Navapanchama Rajayogam | నవపంచమ రాజయోగం.. ఈ మూడురాశుల వారికి అన్ని గుడ్‌న్యూస్‌లే..!
మార్చి 3, 2026

Hyderabad Healing Capital | హైదరాబాద్ ఇక ‘హీలింగ్ క్యాపిటల్’: డేటా సైన్స్, ఏఐతో హెల్త్‌కేర్ అనుసంధానం : మంత్రి శ్రీధర్ బాబు
ఫిబ్రవరి 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



