Strategic MoU | తెలంగాణ–లివర్‌పూల్ మధ్య కీలక ఒప్పందం
Strategic MoU | తెలంగాణ–యూకేలోని లివర్‌పూల్ ప్రాంతాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతమైంది. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్, పరిశోధన, ఆవిష్కరణలు, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, క్రీడారంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించే దిశగా కీలక అడుగులు పడ్డాయి. లివర్‌పూల్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మూడు రోజుల హైదరాబాద్ పర్యటనను అక్టోబర్ 14న ముగించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, లివర్‌పూల్ సిటీ కౌన్సిల్ మధ్య వ్యూహాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది.
- ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్, స్టార్టప్‌లు, క్రీడల్లో సహకారం
- టీ-హబ్–లివర్‌పూల్ సంస్థల మధ్య అవగాహన పత్రం
- పెట్టుబడులు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి కొత్త అవకాశాలు
Strategic MoU | తెలంగాణ–యూకేలోని లివర్‌పూల్ ప్రాంతాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతమైంది. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్, పరిశోధన, ఆవిష్కరణలు, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, క్రీడారంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించే దిశగా కీలక అడుగులు పడ్డాయి. లివర్‌పూల్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం మూడు రోజుల హైదరాబాద్ పర్యటనను అక్టోబర్ 14న ముగించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, లివర్‌పూల్ సిటీ కౌన్సిల్ మధ్య వ్యూహాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది. టీ-హబ్ పర్యటన సందర్భంగా టీ-హబ్, నాలెడ్జ్ క్వార్టర్ లివర్‌పూల్/సియోంటెక్ మధ్య అవగాహన పత్రంపై సంతకాలు జరిగాయి. హైదరాబాద్–లివర్‌పూల్ ఇన్నోవేషన్ బ్రిడ్జ్ ఏర్పాటు ద్వారా ఇరు ప్రాంతాల స్టార్టప్‌లకు కొత్త మార్కెట్లలోకి ప్రవేశించే అవకాశాలు కల్పించనున్నారు. ఆవిష్కరణల ఆధారిత వ్యాపార భాగస్వామ్యాలు, విజ్ఞాన మార్పిడికి ఈ కార్యక్రమం దోహదపడనుంది.
హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్‌పై దృష్టి
లివర్‌పూల్ ప్రతినిధి బృందం జీనోమ్ వ్యాలీని సందర్శించి తెలంగాణలోని బయోఫార్మాస్యూటికల్, ఫార్మాస్యూటికల్, వ్యాక్సిన్, వైద్య సాంకేతికత రంగాల అభివృద్ధిని పరిశీలించింది. పరిశోధన, క్లినికల్ సహకారం, విద్య, శిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. కిమ్స్, యూనివర్సిటీ హాస్పిటల్స్ లివర్‌పూల్ గ్రూప్ మధ్య వైద్య సేవలు, పరిశోధన, సిబ్బంది శిక్షణకు సంబంధించిన సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే అంశాలపైనా చర్చించారు. లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ ఫౌండేషన్ ద్వారా క్రీడలు, ఆరోగ్యం, సమాజాభివృద్ధి రంగాల్లో సహకార అవకాశాలను పరిశీలించారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ, గచ్చిబౌలిలోని ఫిఫా–ఏఐఎఫ్‌ఎఫ్ తెలంగాణ టాలెంట్ అకాడమీ, ఫుట్‌బాల్ క్లబ్‌లు, కోచ్‌లతో సమావేశమయ్యారు. సెంటర్ ఫర్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీల్లో క్రీడా వైద్యం, క్రీడాకారుల ప్రతిభాభివృద్ధి, ఉన్నతస్థాయి శిక్షణపై చర్చలు నిర్వహించారు.
ప్రపంచస్థాయి కేంద్రంగా హైదరాబాద్
తెలంగాణను పెట్టుబడులు, పరిశోధన భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ, లివర్‌పూల్ ప్రాంతాల మధ్య పరస్పర సహకారానికి మంచి అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. ఈ పర్యటనలో జరిగిన చర్చలు ఆచరణాత్మక ఫలితాలనిచ్చే సంస్థాగత భాగస్వామ్యాలకు దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టులో యూకేలో పర్యటించిన నేపథ్యంలో ఈ భాగస్వామ్య కార్యక్రమాలు మరింత ముందుకు సాగాయి. తాజా ఒప్పందాలు రెండు ప్రాంతాల మధ్య పెట్టుబడులు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు కల్పించనున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Kalva Sujatha | ఈవీ రేసు కేసుపై ఎందుకంత గుబులు?.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫైర్
- ●Civil Supplies Department | బకాయి సీఎంఆర్ చెల్లించకుంటే ఆస్తుల జప్తు!
- ●Rajanna Sircilla | రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గం
- ●Aafia Sayed | నితిన్ అలియాస్ రుక్మిణికి హీరోయిన్ దొరికిందోచ్ - బాలీవుడ్ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా!
- ●Rahul Gandhi | న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: రాహుల్ గాంధీ
- ●Abhijeet Dipke Hingoli | ఓటర్లకు చెప్పినట్లే మోదీకి సుప్రీంకోర్టు చెప్పగలదా?

Kalva Sujatha | ఈవీ రేసు కేసుపై ఎందుకంత గుబులు?.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫైర్

Civil Supplies Department | బకాయి సీఎంఆర్ చెల్లించకుంటే ఆస్తుల జప్తు!

Rajanna Sircilla | రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గం

Aafia Sayed | నితిన్ అలియాస్ రుక్మిణికి హీరోయిన్ దొరికిందోచ్ - బాలీవుడ్ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా!



