త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HAL Junior Executive | హెచ్ఏఎల్‌లో 150 జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌

HAL Junior Executive | ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ‌ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) వివిధ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ (Junior Executive) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది.

G

National | Published On Oct 9, 2026, 8.15 am IST

HAL Junior Executive | హెచ్ఏఎల్‌లో 150 జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌
Advertisement

HAL Junior Executive | త్రినేత్ర న్యూస్‌: ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ‌ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) వివిధ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ (Junior Executive) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ది. మొత్తం 150 ఖాళీల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ పోస్టులు హైద‌రాబాద్‌, తుమకూరు, నాశిక్‌, కోరాపుట్ (ఒడిశా), బార్ర‌క్‌పోర్ (ప‌శ్చిమ బెంగాల్‌), ల‌క్నో, కాన్పూర్‌, కోర్వా (యూపీ)లో ఉన్నాయి. ఎలాంటి రాత‌ప‌రీక్ష లేకుండా ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్య‌ర్థ‌/ల‌ను ఎంపిక చేస్తుంది. మూడేండ్ల కాల‌వ్య‌వ‌ధికి రిక్రూట్‌మెంట్ నిర్వ‌హిస్తున్న‌ది. ప్ర‌తి నెల రూ.30,000 నుంచి రూ.1,20,000 జీతం అందుకోవ‌చ్చు.

పోస్టు పేరు: జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌

మొత్తం ఖాళీలు: 150

ఏరోనాటిక్‌- 2, కెమిక‌ల్ 2, సివిల్ 7, కంప్యూట‌ర్ సైన్స్ 6, ఎల‌క్ట్రిక‌ల్ 25, మెకానిక‌ల్ 78, మెట‌ల్ల‌ర్జీ 3, ప్రొడ‌క్ష‌న్ 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హ‌త‌లు: 10+2+4 విధానంలో సంబంధ‌త విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేయాలి. అభ్య‌ర్థులు 2026, అక్టోబ‌ర్ 17 నాటికి 28 ఏండ్ల లోపు వ‌య‌స్కులై ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్‌, ల‌ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: అక్టోబ‌ర్ 17
ఇంట‌ర్వ్యూ: న‌వంబ‌ర్‌లో
వెబ్‌సైట్‌: www.hal-india.co.in.

అప్ల‌య్ ఆన్‌లైన్‌..

పూర్తి వివ‌రాల‌కు..

 

Advertisement
Advertisement