త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide attack on Pak Coast Guard | పాక్‌ కోస్ట్‌గార్డ్‌పై ఆత్మాహుతి దాడి.. 30 మంది దుర్మ‌ర‌ణం!

Suicide attack on Pak Coast Guard | పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చెల‌రేగాయి. గ్వాదర్ జిల్లాలోని జివానీ ప్రాంతం పాన్వాన్‌లో ఉన్న పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై శుక్రవారం సాయంత్రం దాడికి పాల్పడినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) శ‌నివారం ప్రకటించింది.

S

International | Published On Jul 4, 2026, 12.57 pm IST

Suicide attack on Pak Coast Guard | పాక్‌ కోస్ట్‌గార్డ్‌పై ఆత్మాహుతి దాడి.. 30 మంది దుర్మ‌ర‌ణం!
Advertisement
  • తామే చేశామ‌ని బీఎల్ఏ ప్ర‌క‌ట‌న‌
  • బ‌లూచిస్థాన్‌కు స్వాతంత్య్రం వ‌చ్చే వ‌ర‌కు పోరాటం కొన‌సాగిస్తామ‌ని వెల్ల‌డి

Suicide attack on Pak Coast Guard | త్రినేత్ర‌.న్యూస్‌: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చెల‌రేగాయి. గ్వాదర్ జిల్లాలోని జివానీ ప్రాంతం పాన్వాన్‌లో ఉన్న పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై శుక్రవారం సాయంత్రం దాడికి పాల్పడినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) శ‌నివారం ప్రకటించింది. పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కోస్ట్‌ గార్డ్‌ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందని పేర్కొంది. ఈ దాడి ఘ‌ట‌న‌లో 30 మందికి పైగా కోస్ట్‌గార్డ్ సిబ్బంది మృతి చెందార‌ని.. మ‌రికొంద‌రు తీవ్రంగా గాయపడ్డార‌ని బీఎల్‌ఏ వెల్ల‌డించింది. తామే ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు తెలిపింది.

తమ ఆత్మాహుతి విభాగం మజీద్ బ్రిగేడ్ ఈ దాడికి పాల్పడిన‌ట్లు పేర్కొంది. అటౌల్లా బలూచ్ అలియాస్ అజ్మల్ అనే ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కుతో కోస్ట్‌గార్డ్ శిబిరాన్ని పేల్చింది. పేలుడు ధాటికి భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ‌ ఫతెహ్ స్క్వాడ్ కోస్ట్‌గార్డ్ భద్రతా సిబ్బందితో ఎదురుకాల్పులకు దిగారు. ఈ దాడితో భ‌వ‌నం శిథిలాల కింద చిక్కుకున్న‌వారు ఉండ‌డంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని ఆ సంస్థ పేర్కొంది. అనంత‌రం బీఎల్‌ఏ మీడియా విభాగం విడుద‌ల చేసిన 43 సెకండ్ల వీడియోలో పేలుడు పదార్థాలతో ఉన్న ట్రక్కు శిబిరంలోకి ప్రవేశించిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అయితే పాకిస్థాన్ సైన్యం ఇప్పటివరకు ఈ ఘ‌ట‌న‌పై స్పందించ‌లేదు. ఇదిలా ఉండ‌గా బలూచిస్థాన్‌కు పూర్తి స్వాతంత్య్రం సాధించి పెట్ట‌డ‌మేన‌ని బీఎల్ఏ స్ప‌ష్టం చేసింది. అప్ప‌టివ‌ర‌కు పాకిస్థాన్ భద్రతా బలగాలపై సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. ఈ ఆపరేషన్ పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

Advertisement
Advertisement