త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EPFO WhatsApp Service | వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్‌.. పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

EPFO WhatsApp Service | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రారంభించిన వాట్సాప్ సేవలకు భారీ స్పందన లభిస్తోంది. నవంబర్ 1న ప్రారంభమైన ఈ సేవలను కేవలం 14 రోజుల్లోనే కోటికి పైగా సభ్యులు వినియోగించుకున్నారు. పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, చివరి ఐదు లావాదేవీల వివరాలు చూడడం, పీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి సేవలను వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. అలాగే నచ్చిన భాషను ఎంచుకునే సదుపాయం కూడా ఉంది.

S

Business | Published On Nov 21, 2026, 11.25 am IST

EPFO WhatsApp Service | వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్‌.. పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
Advertisement

EPFO WhatsApp Service | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రారంభించిన వాట్సాప్ సేవలకు భారీ స్పందన లభిస్తోంది. నవంబర్ 1న ప్రారంభమైన ఈ సేవలను కేవలం 14 రోజుల్లోనే కోటికి పైగా సభ్యులు వినియోగించుకున్నారు. పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, చివరి ఐదు లావాదేవీల వివరాలు చూడడం, పీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి సేవలను వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. అలాగే నచ్చిన భాషను ఎంచుకునే సదుపాయం కూడా ఉంది.

పీఎఫ్ వాట్సాప్ సేవ‌ల‌కు విశేష స్పంద‌న‌..

ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతా వివరాల కోసం ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్త వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలకు మంచి స్పందన లభిస్తోంది. ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం, 89.88 లక్షల మంది వాట్సాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోగా, 41.79 లక్షల మంది పీఎఫ్ పాస్‌బుక్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మరో 16.18 లక్షల మంది తమ ఖాతాలోని చివరి ఐదు లావాదేవీల వివరాలను పరిశీలించారు. ఈ సేవల ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, ఉద్యోగి వాటా, యజమాని వాటా, పెన్షన్ కాంట్రిబ్యూషన్, చివరిగా జమ అయిన తేదీ వంటి వివరాలను తెలుసుకోవచ్చు.

వాట్సాప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఎలా చెక్ చేయాలి..?

వాట్సాప్‌లో పీఎఫ్ వివరాలు తెలుసుకోవడానికి ముందుగా 8796441800 అనే ఈపీఎఫ్ఓ అధికారిక నంబర్‌ను మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్‌లో ఆ నంబర్‌కు హాయ్ అని సందేశం పంపాలి. ఆటోమేటెడ్ చాట్‌బాట్ అడిగినప్పుడు నచ్చిన భాషను ఎంచుకోవాలి. అనంతరం కనిపించే సేవల జాబితాలో చెక్ బ్యాలెన్స్, లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్, డౌన్‌లోడ్ పాస్‌బుక్, ఛేంజ్ లాంగ్వేజ్ వంటి ఆప్షన్లు ఉంటాయి. కావాల్సిన సేవను ఎంచుకున్న తర్వాత ఈపీఎఫ్ఓ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) పంపిస్తుంది. ఆ ఓటీపీని వాట్సాప్‌లో నమోదు చేసి గుర్తింపును ధ్రువీకరించాలి. ఒకవేళ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)కు గత ఉద్యోగాలకు సంబంధించిన పలు మెంబర్ ఐడీలు అనుసంధానమై ఉంటే, వాటిలో అవసరమైన ఖాతాను ఎంచుకోవాలి.

పాస్‌బుక్‌ను ఎలా డౌన్ లోడ్ చేయాలి..?

పీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు సేవల జాబితాలో డౌన్‌లోడ్ పాస్‌బుక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అవసరమైతే ఓటీపీ ధ్రువీకరణ పూర్తి చేసి, సంబంధిత మెంబర్ ఐడీని ఎంపిక చేసుకోవాలి. అనంతరం ఈపీఎఫ్ఓ పాస్‌వర్డ్ రక్షణతో కూడిన పీడీఎఫ్ ఫైల్‌ను వాట్సాప్‌లో పంపిస్తుంది. ఆ ఫైల్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని తెరవడానికి పుట్టిన తేదీని డీడీఎంఎంవైవై (DDMMYY) ఫార్మాట్‌లో నమోదు చేయాలి. ఈ పాస్‌బుక్‌లో ఉద్యోగి, యజమాని చేసిన పీఎఫ్ చెల్లింపులు, పెన్షన్ జమలు, ఖాతాలో జమ అయిన వడ్డీ వివరాలు ఉంటాయి.

Advertisement
Advertisement