త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ghost Hostels | నాలుగేండ్లుగా ఒక్క విద్యార్థీ లేడు.. అయినా ఆ హాస్ట‌ళ్ల‌కు రూ.1.62 కోట్ల‌ నిధులు

Ghost Hostels | బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన విద్యార్థులు (Students) చ‌దువుకు దూరం కాకూడ‌ద‌న్న ల‌క్ష్యంతో ప్ర‌భుత్వాలు పాఠ‌శాల‌ల‌కు అనుబంధంగా సంక్షేమ హాస్ట‌ళ్ల‌ను (Hostels) ఏర్పాటుచేస్తాయి. ఆహారం, పుస్త‌కాలు, రీడింగ్ హాళ్లు, గ్రంథాల‌యాలు, ల్యాబ్ వంటి వ‌స‌తులు క‌ల్పించి అక్క‌డ ఉండే విద్యార్థులు చ‌దువుల్లో రాణించేందుకు కృషిచేస్తుంటాయి.

G

National | Published On Jul 14, 2026, 9.55 am IST

Ghost Hostels | నాలుగేండ్లుగా ఒక్క విద్యార్థీ లేడు.. అయినా ఆ హాస్ట‌ళ్ల‌కు రూ.1.62 కోట్ల‌ నిధులు
Advertisement

Ghost Hostels | త్రినేత్ర‌.న్యూస్‌: బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన విద్యార్థులు (Students) చ‌దువుకు దూరం కాకూడ‌ద‌న్న ల‌క్ష్యంతో ప్ర‌భుత్వాలు పాఠ‌శాల‌ల‌కు అనుబంధంగా సంక్షేమ హాస్ట‌ళ్ల‌ను (Hostels) ఏర్పాటుచేస్తాయి. ఆహారం, పుస్త‌కాలు, రీడింగ్ హాళ్లు, గ్రంథాల‌యాలు, ల్యాబ్ వంటి వ‌స‌తులు క‌ల్పించి అక్క‌డ ఉండే విద్యార్థులు చ‌దువుల్లో రాణించేందుకు కృషిచేస్తుంటాయి. దీనికోసం ఏటా రూ.కోట్లలో ఖ‌ర్చుచేస్తుంటాయి. అయితే కొన్ని హాస్ట‌ళ్ల‌లో ఒక్క విద్యార్థీ లేక‌పోయినా.. గ‌త నాలుగేండ్లుగా వారి బాగోగుల కోసం నిరాటంకంగా నిధులు (Funding) విడుద‌ల‌వుతూనే ఉన్నాయి. ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌లో నిర్వ‌హ‌ణా లోపాల‌ను ఎత్తిచూపుతూ కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్ జనరల్ (CAG) రూపొందించిన నివేదిక‌లో ఈ బాగోతం బ‌య‌ట‌ప‌డింది. ఆ హాస్ట‌ళ్ల‌ను ఘోస్ట్ హాస్ట‌ల్స్‌గా (Ghost Hostels) పేర్కొంది. దీనికిసంబంధించిన నివేదిక‌ను మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించింది.

మ‌హారాష్ట్ర‌లో 2024, మార్చి నాటికి ప్ర‌భుత్వ ఆధీనంలో 443 (Government Hostels), ప్ర‌భుత్వ ఎయిడెడ్ హాస్ట‌ళ్లు 2388 (Aided Hostels) ఉన్నాయి. ఆ వ‌స‌తి గృహాల్లో 1,21,971 బాలురు, 40,543 బాలికలకు ఉండేవారు. ఆయా హాస్ట‌ళ్లు, విద్యార్థుల‌ కోసం ప్ర‌భుత్వం రూ.2,321 కోట్లు ఖ‌ర్చుచేసింది. అయితే ఆడిట్ సంద‌ర్భంగా 18 ప్ర‌భుత్వ‌, 21 ఎయిడెడ్ హాస్ట‌ళ్ల‌ల్లో కాగ్ త‌నిఖీలు నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా ఆరు హాస్ట‌ళ్ల‌లో ఒక్క విద్యార్థి కూడా లేడ‌ని, ఆయా భ‌వ‌నాల‌కు తాళాలు వేసి ఉన్నట్లు గుర్తించింది. అయిన‌ప్ప‌టికీ వాటి నిర్వ‌హ‌ణ‌కు గ‌త నాలుగేండ్లుగా రూ.1.62 కోట్ల నిధులు ప్ర‌భుత్వం అందుకున్నాయ‌ని వెల్ల‌డించింది. ఇలా నిధులు పొందుతున్న వాటిలో జాల్నా (Jalna) జిల్లాలో నాలుగు, బుల్దానా, లాతూర్‌లో ఒక్కొక్కటి ఉన్నాయ‌ని తెలిపింది. వీటికి ఘోస్ట్ హాస్ట‌ల్స్ అని పేర్కొంది.

జాల్నాలోని మోదీఖాన్ హాస్ట‌ల్‌లో (Modikhan Hostel) 38 మంది విద్యార్థులు, ఒక సూపరింటెండెంట్ ఉన్నట్లు రికార్డులు చూపించార‌ని, అయితే శిథిలావస్థకు చేరుకున్న వ‌స‌తి గృహానికి తాళం వేసి ఉందని వెల్ల‌డించింది. ఆక్యుపెన్సీ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నాలుగేండ్లుగా హాస్టల్‌కు రూ.18 లక్షల గౌరవ వేతనాలు విడుదల చేస్తూనే ఉంద‌ని తెలిపింది. అదే జిల్లాలో ఉన్న జఫ్రాబాద్‌లో 24 మంది విద్యార్థుల కోసం నిర్మించిన హాస్టల్‌లో మురికి, ఖాళీగా ఉన్న పడకలను కాగ్ గుర్తించింది. వెనుకబడిన, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన హాస్టళ్లలో విస్తృత లోపాలను నివేదిక ఎత్తిచూపింది. ఈ నివేదిక‌ను జూలై 10న ప్ర‌భుత్వం శాస‌నస‌భ ముందుంచింది.

Advertisement
Advertisement