Beneficiaries Removed | ఆ పథకం నుంచి 92 లక్షల మంది లబ్దిదారుల తొలగింపు..
Beneficiaries Removed | మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన లాడ్కీ బహిన్ యోజన (Ladki Bahin Yojana) పథకం లబ్దిదారుల్లో పెద్ద సంఖ్యలో అనర్హులను తొలగించింది. ప్రభుత్వం ఇటీవల లబ్ధిదారులకు (Beneficiaries Removed) ఈ -కేవైసీ తప్పనిసరి చేసింది.
Beneficiaries Removed | త్రినేత్ర.న్యూస్: మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన లాడ్కీ బహిన్ యోజన (Ladki Bahin Yojana) పథకం లబ్దిదారుల్లో పెద్ద సంఖ్యలో అనర్హులను తొలగించింది. ప్రభుత్వం ఇటీవల లబ్ధిదారులకు (Beneficiaries Removed) ఈ -కేవైసీ తప్పనిసరి చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల మందికిపై అనర్హులుగా తేలారు. వార్షిక ఆదాయ పరిమితి రూ.2.5 లక్షలు దాటడం, నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండటం, ఇప్పటికే ఇతర ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులుగా ఉండటం, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు, ఒకే కుటుంబంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఈ పథకం ప్రయోజనాలు పొందడం, 65 ఏండ్లు పైబడినవారు, పురుషులు కూడా ఇందులో లబ్ధిపొందుతున్న కారణంగా అందరి పేర్లను తొలగించింది. దీంతో ఈ లాడ్కీ బహిన్ యోజన కింద నమోదుచేసుకున్న ప్రతి 10 మంది మహిళల్లో దాదాపు నలుగురిని తొలగించినట్లయింది.
పేర్లు తొలగించబడిన వారిలో అత్యధికులు అంటే దాదాపు 62 లక్షల మంది eKYC పూర్తి చేయడంలో విఫలమయ్యారు. అదేవిధంగా 4.42 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇక 29 వేల మంది పురుషులు, 8 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పథకం కింద లబ్ధిపొందుతున్నారని తేలింది.
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువ ఉన్న 21 నుంచి 65 ఏండ్ల మహిళలకు ప్రతినెల రూ.1500 అందిస్తున్నది. ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు, అనుబంధ నిబంధనలు రూ. 60 వేల కోట్లు దాటాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ghee | నెయ్యి ఎక్కువ రోజులపాటు తాజాగా, సువాసనతో ఉండాలంటే.. ఇలా నిల్వ చేయాలి..
- ●Devi Prasad | ప్రభుత్వానికి నచ్చిన నివేదిక ఇస్తే దేశభక్తులు.. నిజాలు చెబితే నేరస్థులా?: దేవీప్రసాద్
- ●Ayushman Card | ఒక్క వాట్సాప్ మెసేజ్‌తోనే ఆయుష్మాన్ కార్డు.. కేంద్ర ప్రభుత్వ కొత్త సౌకర్యం..
- ●Priyanka Gandhi | ప్రియాంక గాంధీ ఎక్కడ..? వయనాడ్ దుర్ఘటన నేపథ్యంలో బీజేపీ
- ●Damodar Raja Narasimha | 96 లక్షల మంది చిన్నారుల రక్షణ కోసమే.. ఆల్బండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ: మంత్రి దామోదర
- ●Smart Phones | స్మార్ట్ ఫోన్లలో దృఢమైన బిల్డ్ క్వాలిటీని కోరుకుంటున్న వినియోగదారులు.. సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడి..

Ghee | నెయ్యి ఎక్కువ రోజులపాటు తాజాగా, సువాసనతో ఉండాలంటే.. ఇలా నిల్వ చేయాలి..

Devi Prasad | ప్రభుత్వానికి నచ్చిన నివేదిక ఇస్తే దేశభక్తులు.. నిజాలు చెబితే నేరస్థులా?: దేవీప్రసాద్

Ayushman Card | ఒక్క వాట్సాప్ మెసేజ్‌తోనే ఆయుష్మాన్ కార్డు.. కేంద్ర ప్రభుత్వ కొత్త సౌకర్యం..

Priyanka Gandhi | ప్రియాంక గాంధీ ఎక్కడ..? వయనాడ్ దుర్ఘటన నేపథ్యంలో బీజేపీ






