Phone Screen Protectors | నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిర్ణయం
Phone Screen Protectors | స్మార్ట్‌ఫోన్ (smartphones) స్క్రీన్‌ను కాపాడేందుకు వాడే స్క్రీన్ ప్రొటెక్టర్ల (Phone Screen Protectors) విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Phone Screen Protectors | త్రినేత్ర న్యూస్ : స్మార్ట్‌ఫోన్ (smartphones) స్క్రీన్‌ను కాపాడేందుకు వాడే స్క్రీన్ ప్రొటెక్టర్ల (Phone Screen Protectors) విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్దేశిత ప్రమాణాలు పాటించని తక్కువ నాణ్యత గల స్క్రీన్ గార్డుల విక్రయాలపై నిషేధం విధించింది. మార్కెట్లో విచ్చలవిడిగా లభించే నాసిరకం, క్వాలిటీ లేని మొబైల్ స్క్రీన్ గార్డులు, ప్రొటెక్టర్లకు చెక్ పెట్టేందుకు ఇకపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది.
ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లు IS 19348:2025 అనే ఇండియన్ స్టాండర్డ్‌కు అనుగుణంగా ఉండాలి. దీంతో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లు నిర్దిష్ట ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉత్పత్తులకు వర్తించే తప్పనిసరి రిజిస్ట్రేషన్ విధానంలోకి వస్తాయి. ఈ నిబంధనలను పాటించేందుకు తయారీ దారులకు, దిగుమతి దారులకు కేంద్రం ఆరు నెలల గడువు ఇచ్చింది.
కాగా, ఫోన్ కొన్న వెంటనే ప్రతీ ఒక్కరూ చేసే మొదటి పని స్క్రీన్ గార్డులు వేయించుకోవడం. స్మార్ట్ ఫోన్‌పై గీతలు పడకుండా, పొరపాటున చేయిజారి కిందపడితే డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ప్రతీ ఒక్కరూ స్క్రీన్ ప్రొటెక్టర్లను వేయించుకుంటుంటారు. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల స్క్రీన్ ప్రొటెక్టర్లు లభిస్తున్నాయి. అందరికీ అందుబాటు ధరల్లో 50 రూపాయల నుంచే ఇవి లభిస్తున్నాయి. నాణ్యతను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో నాసిరకం స్క్రీన్ పొటెక్టర్లు విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయి. రోడ్డు పక్కన, బస్టాండ్లలో ఇలా ఎక్కడ పడితే అక్కడ తక్కువ ధరలకే వాటిని విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పొటెక్టర్లను బీఐఎస్ పరిధిలోకి (BIS registration) తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంతో ఇక స్మార్ట్‌ఫక్షన్ స్క్రీన్ పొటెక్టర్ల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది.
Also Read..
మీ అక్కాచెల్లెళ్లను తీసుకురండి.. గర్భా వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్.. ఇక కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు ప్రత్యేక ప్లాన్లు..
యుద్ధం అంటాడు.. మళ్లీ వద్దంటాడు! అమెరికా అధ్యక్షుడికి అంత పవర్ ఉంటుందా?
తాజావార్తలు
- ●Special Trains | చర్లపల్లి నుంచి ప్రయాగ్‌రాజ్, సెంగోట్టైకి ప్రత్యేక ట్రైన్స్‌ను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
- ●Garba | మీ అక్కాచెల్లెళ్లను తీసుకురండి.. గర్భా వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
- ●New Pensions | దసరాకు ముందే కొత్త పెన్షన్లు..!
- ●TG Weather | బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలంగాణ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్..!
- ●Srinivas Goud | వినయ్ భాస్కర్‌ను చంపేస్తరా?
- ●TRAI | మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్.. ఇక కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు ప్రత్యేక ప్లాన్లు..

Special Trains | చర్లపల్లి నుంచి ప్రయాగ్‌రాజ్, సెంగోట్టైకి ప్రత్యేక ట్రైన్స్‌ను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Garba | మీ అక్కాచెల్లెళ్లను తీసుకురండి.. గర్భా వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

New Pensions | దసరాకు ముందే కొత్త పెన్షన్లు..!

TG Weather | బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలంగాణ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్..!






