Garba | మీ అక్కాచెల్లెళ్లను తీసుకురండి.. గర్భా వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Garba | గర్భా వేడుకలపై (garba during Navratri) బీజేపీ ఎమ్మెల్యే రమేశ్వర్ శర్మ (Rameshwar Sharma) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం యువకులు గర్భా వేడుకలకు రావాలనుకుంటే రావొచ్చన్నారు. కానీ, ఒంటరిగా కాకుండా తమతోపాటూ తమ అక్క, చెల్లి, కుమార్తెలను కూడా తీసుకురావాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Garba | త్రినేత్ర న్యూస్ : నవరాత్రుల్లో నిర్వహించే గర్భా వేడుకలపై (garba during Navratri) మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని హుజూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రమేశ్వర్ శర్మ (Rameshwar Sharma) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గర్భా (Garba) వేడుకల్లో ముస్లింల ప్రవేశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఏఐఎంఐఎం (AIMIM) పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.
భోపాల్‌లో (Bhopal) జరిగిన ఓ బహిరంగ సభలో ఎమ్మెల్యే రమేశ్వర్ శర్మ మాట్లాడుతూ.. ముస్లిం యువకులు గర్భా వేడుకలకు రావాలనుకుంటే రావొచ్చన్నారు. కానీ, ఒంటరిగా కాకుండా తమతోపాటూ తమ అక్క, చెల్లి, కుమార్తెలను కూడా తీసుకురావాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ముస్లిం యువకులు గర్బాకు ఒక్కరే ఎందుకు రావాలనుకుంటున్నారు..? వారు ఒంటరిగా రాకుండా తమ వెంట అక్కాచెల్లెళ్లను, కుమార్తెలను తీసుకురావాలి. మా యువకులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ముస్లింలు శాశ్వతంగా మాతో కలవాలనుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, వారు ముందుగా సనాతన ధర్మాన్ని స్వీకరించి నుదుటిపై తిలకం దిద్దుకోవాలి. 'జై శ్రీరామ్' నినాదాలు చేయాలి. అప్పుడు ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు" అని వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్, ఏఐఎంఐఎం పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. రమేశ్వర్ శర్మ వ్యాఖ్యలు అత్యంత నీచంగా, చౌకబారుగా ఉన్నాయని భోపాల్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ వ్యాఖ్యానించారు. ఆయన తన తీరు మార్చుకోవాలని చురకలంటించారు. మరోవైపు ఎమ్మెల్యే రమేశ్వర్ శర్మ ముందుగా భారత రాజ్యాంగాన్ని చదువుకోవాల్సిన అవసరం ఉందని ఎంఐఎం మధ్యప్రదేశ్ అధ్యక్షుడు మొహ్సిన్ అలీ ఖాన్ అన్నారు. ఇలాంటి విభజన వ్యాఖ్యలు దేశ సమగ్రతకే ముప్పు అని పేర్కొన్నారు.
Also Read..
మలేషియా వీసా-ఫ్రీ ట్రిప్‌తో ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? అది చట్టరీత్యా నేరం.. భారత్ హెచ్చరిక
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలంగాణ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్..!
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Srinivas Goud | వినయ్ భాస్కర్‌ను చంపేస్తరా?
- ●TRAI | మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్.. ఇక కాల్స్, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక ప్లాన్లు..
- ●Visa-Free Countries For Indians 2026 | వీసా టెన్షన్ లేదు.. ప్యాకింగ్ చేసుకొని బయలుదేరడమే! భారత పాస్‌పోర్ట్‌తో 2026లో వీసా లేకుండా వెళ్లగల 7 దేశాలు
- ●Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్
- ●Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..
- ●Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Srinivas Goud | వినయ్ భాస్కర్‌ను చంపేస్తరా?

TRAI | మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్.. ఇక కాల్స్, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక ప్లాన్లు..

Visa-Free Countries For Indians 2026 | వీసా టెన్షన్ లేదు.. ప్యాకింగ్ చేసుకొని బయలుదేరడమే! భారత పాస్‌పోర్ట్‌తో 2026లో వీసా లేకుండా వెళ్లగల 7 దేశాలు

Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్






