TRAI | మొబైల్ యూజర్లకు ట్రాయ్ గుడ్‌న్యూస్.. ఇక కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు ప్రత్యేక ప్లాన్లు..
TRAI | మొబైల్ రీచార్జ్ విషయంలో టెలికాం వినియోగదారులకు మరిన్ని అవకాశాలు కల్పించేలా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ సేవలను మాత్రమే ఉపయోగించే వినియోగదారుల కోసం ప్రత్యేక టారిఫ్ వోచర్లు అందుబాటులో ఉండేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
TRAI | మొబైల్ రీచార్జ్ విషయంలో టెలికాం వినియోగదారులకు మరిన్ని అవకాశాలు కల్పించేలా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ సేవలను మాత్రమే ఉపయోగించే వినియోగదారుల కోసం ప్రత్యేక టారిఫ్ వోచర్లు అందుబాటులో ఉండేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ట్రాయ్ టెలికాం వినియోగదారుల రక్షణ (పదమూడో సవరణ) నిబంధనలు-2026ను విడుదల చేసింది. 2024లో అమల్లోకి వచ్చిన టెలికాం వినియోగదారుల రక్షణ (పన్నెండో సవరణ) నిబంధనల తర్వాత వాయిస్, ఎస్‌ఎంఎస్ మాత్రమే అందించే ప్రత్యేక టారిఫ్ వోచర్ల లభ్యత పరిమితంగా ఉందని ట్రాయ్ గుర్తించింది. ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన వినియోగదారులకు తక్కువ కాలపరిమితి కలిగిన సరసమైన రీచార్జ్ ఆప్షన్లు అందుబాటులో లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పదమూడో సవరణ ముసాయిదాను ట్రాయ్ ఈ ఏడాది ఏప్రిల్ 7న ప్రజాభిప్రాయాల కోసం విడుదల చేసింది.
ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లను అందించాల్సిందే..
ఈ ముసాయిదాపై వాటాదారులు, సంబంధిత వర్గాల నుంచి మొత్తం 1,132 స్పందనలు అందాయి. దీనిపై జూన్ 15న ఓపెన్ హౌస్ చర్చను కూడా నిర్వహించారు. అందిన అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం, ట్రాయ్ తన విశ్లేషణ ఆధారంగా టెలికాం వినియోగదారుల రక్షణ (పదమూడో సవరణ) నిబంధనలు-2026ను ఖరారు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం టెలికాం సంస్థలు వాయిస్, ఎస్‌ఎంఎస్ సేవల కోసం ప్రత్యేక టారిఫ్ వోచర్లను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. 30 రోజుల కాలపరిమితి, 30 రోజుల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన వాయిస్, ఎస్‌ఎంఎస్, డేటా ప్రత్యేక టారిఫ్ వోచర్లకు అనుగుణంగా వాయిస్, ఎస్‌ఎంఎస్ కోసం ప్రత్యేకంగా తగిన టారిఫ్ తగ్గింపుతో కూడిన ప్లాన్లను అందించాలి. ప్రతి నెలా ఒకే తేదీన రీచార్జ్ పునరుద్ధరించుకునే అవకాశం కూడా ఉండాలి. ఒక నెలలో అదే తేదీ అందుబాటులో లేకపోతే, ఆ నెలలోని చివరి తేదీన రీచార్జ్ పునరుద్ధరణ జరిగేలా నిబంధనల్లో పేర్కొన్నారు. దీంతో వినియోగదారులు తమకు అనుకూలమైన తేదీని ఎంచుకుని నెలవారీ రీచార్జ్‌ను కొనసాగించుకునే అవకాశం ఉంటుంది.
తక్కువ ఆదాయం కలిగిన వారికి ఉపయోగం..
అలాగే 30 రోజుల కాలపరిమితి, ప్రతి నెలా ఒకే తేదీన పునరుద్ధరించుకునే ఆప్షన్ కంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన కనీసం ఒక వాయిస్, ఎస్‌ఎంఎస్ ప్రత్యేక టారిఫ్ వోచర్‌ను కూడా టెలికాం సంస్థలు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాయిస్, ఎస్‌ఎంఎస్, డేటా కలిపి అందించే ప్రత్యేక టారిఫ్ వోచర్లకు ఉన్న కాలపరిమితులకు అనుగుణంగా ఈ వోచర్ ఉండాలని ట్రాయ్ స్పష్టం చేసింది. డేటా సేవలను ఉపయోగించని వినియోగదారులకు ఈ నిబంధనలతో మరిన్ని రీచార్జ్ ఎంపికలు లభించనున్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన వినియోగదారులు తమ అవసరాలు, ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా రీచార్జ్ ప్లాన్‌లను ఎంచుకునే అవకాశం పెరుగుతుందని ట్రాయ్ తెలిపింది. డేటాతో కలిపి వచ్చే ప్రత్యేక టారిఫ్ వోచర్లను ఉపయోగించకూడదనుకునే వినియోగదారులకు కూడా ఈ మార్పులు మరిన్ని ఎంపికలను అందిస్తాయని పేర్కొంది.
డేటా అవసరం లేని వారికి ప్రయోజనం..
ఈ కొత్త టారిఫ్ విధానం వినియోగదారుల అవసరాలను తగినంతగా పరిష్కరిస్తుందని ట్రాయ్ అభిప్రాయపడింది. ముఖ్యంగా డేటా అవసరం లేని, కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్ సేవలను మాత్రమే వినియోగించే వారికి తమ అవసరాలకు, బడ్జెట్‌కు అనుగుణంగా రీచార్జ్ చేసుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపింది. ఈ సవరణ నిబంధనలను ట్రాయ్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అదనపు సమాచారం లేదా వివరణల కోసం ట్రాయ్ ఆర్థిక, ఆర్థిక విశ్లేషణ విభాగం సలహాదారు విజయ్ కుమార్‌ను 011-20907773 నంబర్‌లో సంప్రదించవచ్చు. అలాగే fea1-div@trai.gov.in ఈ-మెయిల్ ద్వారా కూడా వివరాలు పొందవచ్చని ట్రాయ్ తెలిపింది.
సంబంధిత వార్తలు

TRAI | 1601 నంబర్ సిరీస్‌ను ప్రవేశపెట్టిన ట్రాయ్.. ఈ నంబర్లను ఏయే కంపెనీలకు ఇచ్చారంటే..
ఆగస్టు 11, 2026

TRAI | కాల్ క్వాలిటీపై ఇక ఫిర్యాదు చేయడం చాలా సులభం.. ట్రాయ్ కొత్త మైకాల్ యాప్ విడుదల..
ఆగస్టు 4, 2026

TRAI | దూసుకెళ్తున్న టెలికాం రంగం.. దేశంలో 130 కోట్లకు పైగా వైర్లెస్ కనెక్షన్లు..
జులై 29, 2026
తాజావార్తలు
- ●Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్
- ●Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..
- ●Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే
- ●Malaysia Visa-Free Travel India | మలేషియా వీసా-ఫ్రీ ట్రిప్‌తో ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? అది చట్టరీత్యా నేరం.. భారత్ హెచ్చరిక
- ●OnePlus N6 Lite | వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు..

Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్

Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..

Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే



