త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Toe Rings | పెళ్లైన మహిళలు కాలి రెండో వేలికే మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలివే..!

Toe Rings | భారతీయ సంప్రదాయంలో వివాహిత మహిళలు ధరించే ప్రధాన ఆభరణాల్లో కాలి మెట్టెల‌కు (Toe Rings) ప్ర‌త్యేక స్థానం ఉంది. వెండితో చేసిన మెట్టెల‌ను రెండు కాళ్ల రెండో వేలికి (second toe) జ‌త‌గా ధ‌రిస్తారు. దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థాలు, ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. కాలి వేళ్లలోని నరాలపై ఒత్తిడి పడటం వల్ల శరీర సమతుల్యత, గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడతాయని న‌మ్మ‌కం.

D

Popular news | Published On Nov 24, 2026, 4.32 pm IST

Toe Rings | పెళ్లైన మహిళలు కాలి రెండో వేలికే మెట్టెలు ఎందుకు ధరిస్తారు..? దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలివే..!
Advertisement

Toe Rings | త్రినేత్ర న్యూస్ : భారతీయ సంప్రదాయంలో వివాహిత స్త్రీలు (Married Women) ధ‌రించే ఆభ‌ర‌ణాల‌కు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంటుంది. మంగళసూత్రం, సిందూరం, మెట్టెలు, గాజులు, పువ్వులు సౌభాగ్యానికి చిహ్నాలుగా భావిస్తారు. ఇవి కేవలం అలంకరణ మాత్రమే కాదు.. వీటి వెనుక లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆరోగ్యపరమైన ప్రాముఖ్యత కూడా దాగి ఉంది. వీటిలో కాలి వేళ్ల‌కు పెట్టుకునే మెట్టెలు (Toe Rings) అత్యంత ముఖ్య‌మైన‌వి.

సాధార‌ణంగా పెళ్లైన మ‌హిళ‌లు వెండితో చేసిన మెట్టెల‌ను రెండు కాళ్ల రెండో వేలికి (second toe) జ‌త‌గా ధ‌రిస్తార‌న్న విష‌యం తెలిసిందే. అయితే, రెండో వేలికే ఎందుకు పెట్టుకోవాల‌ని అని చాలా మందికి డౌట్ రావొచ్చు. ఎందుకంటే దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థాలు, ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి మ‌రి. ఆయుర్వేదం, ఆక్యుప్రెష‌న్ ప్ర‌కారం.. కాలి రెండో వేలిలో ఉండే ఒక ముఖ్యమైన నరం నేరుగా స్త్రీ గర్భాశయానికి (Uterus) అనుసంధానమై అక్కడి నుండి గుండెకు చేరుతుంది. ఆ వేలికి మెట్టెలు ధరించడం వల్ల నడిచేటప్పుడు ఆ నరంపై సున్నితమైన ఒత్తిడి ప‌డి.. గ‌ర్భాశ‌యానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌రిచి రుతుచ‌క్రం (Menstrual cycle) సక్రమంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు సంతానోత్పత్తి సామర్థ్యం పెరిగేందుకు తోడ్పడుతుంది. మహిళల్లో రక్తపోటును (Blood Pressure) సమతుల్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

వెండినే ఎందుకు..?

మెట్టెల‌ను బంగారంతో (Gold Toe Rings) కాకుండా వెండితోనే త‌యారు చేస్తారు. ఇందుకు అనేక‌ కారణాలు ఉన్నాయి. వెండిని భారతీయ సంస్కృతిలో చాలాకాలంగా శుభప్రదమైన లోహంగా భావిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లకు ధరించే ఆభరణాల్లో ఎక్కువ‌గా వెండినే ఉప‌యోగించ‌డం సాధార‌ణంగా క‌నిపిస్తుంది. వెండికి శరీరంలోని వేడిని తగ్గించే గుణం ఉంటుంది. ఇది భూమి నుంచి వ‌చ్చే ఎనర్జీని (Energy) గ్రహించి శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవిని అగౌరవపరచకూడదనే ఉద్దేశంతో బంగారు ఆభ‌ర‌ణాల‌ను న‌డుము కింది భాగంలో ధ‌రించ‌రు. అంతేకాదు దీని వెనుక ఆర్థిక ప‌ర‌మైన కార‌ణాలు కూడా ఉన్నాయి. బంగారం చాలా ఖ‌రీదుతో కూడుకున్న‌ది. ప్ర‌తీ ఒక్క‌రూ కొన‌లేరు. అదే వెండి అంద‌రికీ అందుబాటు ధ‌ర‌ల్లోనే ఉంటుంది కాబ‌ట్టి దీన్ని ఎంచుకున్నారు.

Also Read..

మళ్లీ ఎన్డీయే గూటికి అకాలీదళ్‌.. పంజాబ్ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ

తండ్రి ఇంటిని ఖాళీ చేయాల్సిందే.. కొడుకు, కోడలికి కోర్టు షాక్..!

చనిపోయిన వారి బట్టలు ఎందుకు వేసుకోకూడదు? వాటిని ఏం చేయాలి?

Advertisement
Advertisement