Windfall Tax | పెట్రోల్ ఎగుమతులపై జీరో సుంకం.. డీజిల్, ఏటీఎఫ్‌పై పెంపు
Windfall Tax | పశ్చిమాసియాలో యుద్ధం.. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అనిశ్చితి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (SAED) పూర్తిగా రద్దు చేసింది. అదే సమయంలో డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై సుంకాలను పెంచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన సుంకాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
Windfall Tax | పశ్చిమాసియాలో యుద్ధం.. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అనిశ్చితి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (SAED) పూర్తిగా రద్దు చేసింది. అదే సమయంలో డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై సుంకాలను పెంచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన సుంకాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
సవరించిన సుంకాలు ఇలా..
పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ.2.50గా ఉన్న సుంకాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. డీజిల్‌పై రూ.8.50గా ఉన్న సుంకాన్ని రూ.11.50కి పెంచింది. ఏటీఎఫ్‌పై రూ.10.50గా ఉన్న సుంకాన్ని రూ.11కి సవరించింది. పశ్చిమాసియాలో ఘర్షణలతో అంతర్జాతీయ ముడిచమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి మీదుగా జరిగే వాణిజ్య నౌకాయానంపై ప్రభావం పడింది. యుద్ధానికి ముందు భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురులో దాదాపు 45 శాతం ఈ మార్గం ద్వారానే వచ్చేది. తాజా పరిణామాలతో భారత్ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలపై దృష్టి సారించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ధరలు లభిస్తుండటంతో రిఫైనరీలు దేశీయ అవసరాల కంటే ఎగుమతులకే ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. దీన్ని నియంత్రించి దేశీయంగా ఇంధన లభ్యతను కాపాడటమే ఎగుమతి సుంకాల సవరణ వెనుక ప్రధాన ఉద్దేశం. పెట్రోల్‌పై సుంకం రద్దు ఎగుమతిదారులకు ఊరటనివ్వగా.. డీజిల్, ఏటీఎఫ్‌పై పెంపు ద్వారా దేశీయ సరఫరాకు ప్రాధాన్యమిచ్చింది.
50శాతం పెరిగిన ఎగుమతి ఆదాయం
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం వంటి పరిణామాలతో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య భారత్ ఇంధన ఎగుమతుల పరిమాణం తగ్గింది. అయినప్పటికీ ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు 50 శాతం పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినా దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను స్థిరంగా కొనసాగిస్తోంది. ప్రపంచ ఇంధన సంక్షోభం ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడకుండా సరఫరాలను సమతుల్యం చేసేందుకు కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Palak Tiwari | మూడేళ్ల ప్రేమకు బ్రేకప్.. పాలక్ తివారీ, ఇబ్రహీం అలీఖాన్ విడిపోయారా?
అక్టోబర్ 31, 2026

Census 2027 | జనాభా లెక్కలకు ముహూర్తం ఖరారు.. 2027 జనవరి 25 నుంచి షురూ..
అక్టోబర్ 30, 2026

Sanjay Raut | మాల్యా మోసగాడు కాదు.. మోదీ ప్రసంగాలు బాగుంటాయి.. సంజయ్ రౌత్ పుస్తకంలో ఆసక్తికర వ్యాఖ్యలు
అక్టోబర్ 30, 2026
తాజావార్తలు
- ●PM Modi Ekta Nagar | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం వద్ద స్కైవాక్, రెయిన్ ఫారెస్ట్
- ●Kayadu Lohar | ఓటీటీలోకి కయదు లోహర్ మలయాళం ఫాంటసీ థ్రిల్లర్ మూవీ - క్రికెటర్ ఆత్మగా మారితే...
- ●Kiren Rijiju | మీరు నియమించిన అధికారులే కద.. మరి అప్పుడెలా ఓడిపోయారు.. సర్, ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్‌కు ఐదు ప్రశ్నలు సంధించిన కేంద్ర మంత్రి
- ●RBI | ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయి.. ఎప్పటి నుంచి అంటే.. ఆర్బీఐ కీలక నిర్ణయం..?
- ●Neuralink Blindsight | మెదడుతోనే ప్రపంచాన్ని చూడొచ్చు.. ఎలాన్ మస్క్ న్యూరాలింక్ సంచలనం!
- ●MLA Sanjay | అబద్దాలు చెప్పడంలో నిజంగా నువే గొప్ప

PM Modi Ekta Nagar | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం వద్ద స్కైవాక్, రెయిన్ ఫారెస్ట్

Kayadu Lohar | ఓటీటీలోకి కయదు లోహర్ మలయాళం ఫాంటసీ థ్రిల్లర్ మూవీ - క్రికెటర్ ఆత్మగా మారితే...

Kiren Rijiju | మీరు నియమించిన అధికారులే కద.. మరి అప్పుడెలా ఓడిపోయారు.. సర్, ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్‌కు ఐదు ప్రశ్నలు సంధించిన కేంద్ర మంత్రి

RBI | ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయి.. ఎప్పటి నుంచి అంటే.. ఆర్బీఐ కీలక నిర్ణయం..?



