Vijaya Reddy | నేనే ఖైరతాబాద్ అభ్యర్థిని.. దానం ఎంపీ అభ్యర్థి
Vijaya Reddy | ఖైరతాబాద్ నియోజకవర్గం బరిలో దిగేందుకు కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్, రోహిన్ రెడ్డి, విజయా రెడ్డి టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
Vijaya Reddy | త్రినేత్ర న్యూస్ : ఖైరతాబాద్ నియోజకవర్గం బరిలో దిగేందుకు కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్, రోహిన్ రెడ్డి, విజయా రెడ్డి టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
అయితే ఖైరతాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపాలని పీజేఆర్ కూతురు, కాంగ్రెస్ నేత విజయారెడ్డి.. గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎలక్షన్ కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా విజయా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే.. దానం నాగేందర్ ఎంపీ అభ్యర్థి అని ఆమె పేర్కొన్నారు. పీజేఆర్ బిడ్డకు ఈసారైనా న్యాయం జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. పీజేఆర్ పేరు లేనిది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముందుకు వెళ్లదు. దానం నాగేందర్‌ను జాతీయ రాజకీయాలకు పంపి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అని విజయా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటం, దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న విజయారెడ్డి, ఈ ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు హైకోర్టు విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
సంబంధిత వార్తలు

Vijaya Reddy | ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆపండి.. హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి
అక్టోబర్ 1, 2026

CM Revanth Reddy | సిరిసిల్లలో గెలిపిస్తే ఢిల్లీని ఒప్పించి మంత్రిని చేస్తా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 30, 2026

Bhatti Vikramarka | ఓట్ల తొలగింపుపై సమాధానం చెప్పాలి : డిప్యూటీ సీఎం భట్టి
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Jio | జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూ.1,499కే ఫోన్, 6 నెలలు ఫ్రీ రీఛార్జ్..
- ●Tummala Nageshwar Rao | 100 శాతం మద్దతు ధరకు కేంద్రమే కొనాలి: మంత్రి తుమ్మల
- ●Bhagyashri Borse | మోహన్‌లాల్ సినిమా నుంచి తప్పుకున్న భాగ్యశ్రీ బోర్సే - ఫొటోతో రూమర్లకు చెక్
- ●Mamata Banerjee | మమత వర్గానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
- ●Med Plus | మెడ్‌ప్లస్‌లో బంగారు నగలు మాయం..
- ●RaviTeja | రవితేజ "తులాభారం" - క్లాస్ డైరెక్టర్‌తో మాస్ మహారాజా హారర్ మూవీ

Jio | జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూ.1,499కే ఫోన్, 6 నెలలు ఫ్రీ రీఛార్జ్..

Tummala Nageshwar Rao | 100 శాతం మద్దతు ధరకు కేంద్రమే కొనాలి: మంత్రి తుమ్మల

Bhagyashri Borse | మోహన్‌లాల్ సినిమా నుంచి తప్పుకున్న భాగ్యశ్రీ బోర్సే - ఫొటోతో రూమర్లకు చెక్

Mamata Banerjee | మమత వర్గానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ



