Windfall Tax | చమురు సంస్థలకు ఊరట.. విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గించిన కేంద్రం..!
Windfall Tax | కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై విధిస్తున్న స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (విండ్‌ఫాల్ ట్యాక్)ను ట్యాక్స్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు జూన్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి.
Windfall Tax | కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై విధిస్తున్న స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (విండ్‌ఫాల్ ట్యాక్)ను ట్యాక్స్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు జూన్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటర్‌కు రూ.3 నుంచి రూ.1.50కి తగ్గించింది. డీజిల్‌పై లీటరుకు రూ.16.5 నుంచి రూ.13.5కి, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ.16 నుంచి రూ.9.50కి తగ్గించినట్లు వెల్లడించింది. అలాగే పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్‌ను కొనసాగిస్తూ సున్నా శాతంగానే ఉంచినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
దేశీయ వినియోగానికి ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుత డ్యూటీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదని కూడా తెలిపింది. ఇటీవలే పెట్రోల్‌పై విండ్ఫాల్ ట్యాక్స్‌ను ప్రభుత్వం రూ.3కి పెంచింది. మే 16న నిర్వహించిన వీక్షీ సమీక్షలో దీన్ని మళ్లీ తగ్గించి రూ.1.5కి తీసుకువచ్చింది. ఇదే సమయంలో డీజిల్, ఏటీఎఫ్‌పై కూడా పలు దశల్లో సవరణలు చేసింది. మార్చి 26న డీజిల్‌పై లీటరుకు రూ.21.50, ఏటీఎఫ్‌పై రూ.29.50 ఎగుమతి సుంకం విధించగా.. ఏప్రిల్ 11 సమీక్షలో ఇవి వరుసగా రూ.55.5, రూ.42కి పెరిగాయి. అనంతరం ఏప్రిల్ 30 సమీక్షలో వీటిని రూ.23, రూ.33కి తగ్గించారు. మే 16న మళ్లీ సవరించి రూ.16.5, రూ.16గా నిర్ణయించారు. పశ్చిమాసియాలో అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయ సరఫరా భద్రత కోసం ఈ విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ప్రభుత్వం విధించిన విషయం తెలిసిందే.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన
- ●వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?
- ●Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'
- ●Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!
- ●Traffic Restrictions | రేపు నల్లగొండ ఎక్స్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు..
- ●Rajanna Temple | శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి

Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన

వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?

Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'

Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!





