త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | కోలీవుడ్ డైరెక్ట‌ర్ బ‌యోపిక్‌లో టాలీవుడ్ హీరోయిన్లు – బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీకి సీక్వెల్ క‌న్ఫామ్‌

కోలీవుడ్ డైరెక్ట‌ర్ మారి సెల్వ‌రాజ్ జీవితంలోని కీల‌క ఘ‌ట్టాల ఆధారంగా రూపొందిన త‌మిళ మూవీ వాళై బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. వాళై మూవీకి సీక్వెల్‌గా వాళై 2 రాబోతుంది. ఈ సీక్వెల్‌లో ప్రియాంక అరుళ్ మోహ‌న్‌, క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్లుగా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On May 26, 2026, 4.06 pm IST

Kayadu Lohar | కోలీవుడ్ డైరెక్ట‌ర్ బ‌యోపిక్‌లో టాలీవుడ్ హీరోయిన్లు – బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీకి సీక్వెల్ క‌న్ఫామ్‌
Advertisement

Kayadu Lohar | కోలీవుడ్ డైరెక్ట‌ర్ మారి సెల్వ‌రాజ్ జీవితంలోని కీల‌క ఘ‌ట్టాల ఆధారంగా రూపొందిన వాళై మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కేవ‌లం ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో 45 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. వాళై సినిమాకు మారి సెల్వ‌రాజ్ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ఫిక్ష‌న‌ల్ బ‌యోపిక్‌లో నిఖిలా విమ‌ల్ హీరోయిన్‌గా న‌టించింది. తాజాగా వాళై మూవీకి సీక్వెల్ రాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తొలి పార్ట్ పెద్ద హిట్ట‌వ్వ‌డంతో సీక్వెల్‌ను భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించేందుకు మారి సెల్వ‌రాజ్ ప్లాన్ చేశార‌ట‌. వాళై పార్ట్ వ‌న్‌లో బాల్యంలో తాను ఎదుర్కొన్న క‌ష్టాల‌ను చూపించారు మారి సెల్వ‌రాజ్‌. సీక్వెల్‌లో మాత్రం టీనేజ్‌లో ఎదురైన క‌ష్టాలు, ల‌వ్ ఫెయిల్యూర్స్‌తో పాటు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టే క్ర‌మంలో ఎదురైన అవ‌మానాల‌ను ఆవిష్క‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

క‌య‌దు లోహ‌ర్‌..

వాళై 2 మూవీలో నిఖిల విమ‌ల్‌తో పాటు క‌య‌దు లోహ‌ర్‌, ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్లుగా న‌టించ‌బోతున్నార‌ట‌. మారి సెల్వ‌రాజ్ ప్రియురాలిగా క‌య‌దు లోహ‌ర్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ప్రియాంక అరుళ్ మోహ‌న్ పాత్ర ఏమిట‌న్న‌ది మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు. మారి సెల్వ‌రాజ్ పాత్ర‌లో సుజ‌ల్ వెబ్ సిరీస్ ఫేమ్ క‌థిర్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.
వాళై పార్ట్ వ‌న్‌కు భిన్నంగా కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వాళై 2ను సాగ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో క‌లిసి మారి సెల్వ‌రాజ్ ఈ సినిమాను నిర్మించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

నాని గ్యాంగ్ లీడ‌ర్‌తో...

ప్రియాంక అరుళ్ మోహ‌న్‌, క‌య‌దు లోహ‌ర్ ఇద్ద‌రు తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతున్నారు. నాని గ్యాండ్ లీడ‌ర్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అరుళ్ మోహ‌న్‌, ఆ త‌ర్వాత నానితోనే స‌రిపోదా శ‌నివారం సినిమా చేసింది. ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీలో హీరోయిన్‌గా న‌టించింది. మ‌రోవైపు క‌య‌దు లోహ‌ర్ ప్ర‌స్తుతం నాని ప్యార‌డైజ్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఆగ‌స్ట్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇటీవ‌లే ఫంకీ మూవీలో విశ్వ‌క్‌సేన్‌కు జోడీగా క‌నిపించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement