Ratna Debnath | నేను బిడ్డను కోల్పోయా.. మమత కుర్చీని కోల్పోయింది : ఆర్జీకార్ మృతురాలి తల్లి
Ratna Debnath | మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తాను తీవ్ర దుఃఖంలో ఉన్నామని ఆర్జీకార్ మృతురాలి తల్లి, బీజేపీ ఎమ్మెల్యే రత్న దేబ్‌నాథ్ (Ratna Debnath) అన్నారు. తాను బిడ్డను కోల్పోతే.. దీదీ మాత్రం సీఎం కుర్చీని కోల్పోయిందంటూ వ్యాఖ్యానించారు.
Ratna Debnath | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)పై కోల్‌కతాలోని ఆర్జీకార్ అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తల్లి, బీజేపీ ఎమ్మెల్యే రత్న దేబ్‌నాథ్ (Ratna Debnath) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను, దీదీ ఇద్దరం చాలా నష్టపోయామని పేర్కొన్నారు. తాను తన బిడ్డను కోల్పోతే, మమత మాత్రం తన సీటును కోల్పోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
2024లో కోల్‌కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో రాత్రి సమయంలో విధుల్లో ఉన్న 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ డాక్టర్‌పై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు, డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో అప్పటి దీదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ ఘటనలో బాధితురాలి తల్లి రత్న దేబ్‌నాథ్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాణిహట్టి నుంచి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె నిన్న సీఎం సువేందు అధికారిని (CM Suvendu Adhikari) మర్యాదపూర్వకంగా కలిశారు.
సీఎంతో భేటీ అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిజాయితీకి ఉన్న శక్తి అపారమైనదని.. అన్యాయానికి వ్యతిరేకంగా మనం ఓపికగా పోరాడాలని పేర్కొన్నారు. ఇవాళ తాను, మమతా బెనర్జీ ఇద్దరం చాలా దుఃఖంలో ఉన్నామని వ్యాఖ్యానించారు. "నేను నా కూతుర్ని కోల్పోయాను. నా జీవితాన్ని ప్రజలకు అంకితం చేశాను. కానీ మమతా బెనర్జీ 14వ ఫ్లోర్‌లో ఉన్న తన సీఎం కుర్చీని కోల్పోయింది" అని దేబ్‌నాథ్ తన పోస్టులో రాసుకొచ్చారు. మాజీ సీఎం, తృణమూల్ నేతలు రానున్న రోజుల్లో దారుణమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తీవ్రంగా హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | బీజేపీది రాజకీయ డ్రామా.. పెట్రోల్ ధరలు పెంచుకుంట మోసపు యాత్రలు చేస్తోంది: మంత్రి పొన్నం
మే 25, 2026

P Muralidhar Rao | ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు నమోదు.. ఏపీ సర్కార్‌పై బీజేపీ నేత ఫైర్
మే 24, 2026

Mamata Banerjee Football Sculpture | సాల్ట్ లేక్ స్టేడియం వద్ద మమతా బెనర్జీ ‘వింత’ విగ్రహం కూల్చివేత.. యాక్షన్‌లోకి దిగిన బీజేపీ ప్రభుత్వం
మే 23, 2026
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు



