Marco Rubio Taj Mahal | తాజ్ మహల్ దగ్గర మార్కో రూబియో ఫోటోషూట్.. చరిత్ర తెలిస్తే ఇలా చేయరంటూ ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
తాజ్ మహల్ దగ్గర ఫోటో దిగిన అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోకి ఇరాన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. తాజ్ మహల్ కు ఇరాన్ కు ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా?
Marco Rubio Taj Mahal | త్రినేత్ర.న్యూస్ : అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం నడుస్తున్న వేళ.. హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్.. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ (US Secretary of State) మార్కో రూబియోపై సెటైర్లు వేసింది. సోమవారం భారత్ పర్యటనకు వచ్చిన రూబియో, ఆగ్రాలోని ఐకానిక్ తాజ్ మహల్ (Taj Mahal) వద్ద తన భార్య జీనెట్ రూబియోతో కలిసి ఫోటోలు దిగారు. యునెస్కో గుర్తింపు పొందిన ఆ కట్టడం ముందున్న ఫేమస్ బెంచ్‌పై కూర్చుని దిగిన ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగానే, ఇరాన్ అధికారులు ఎంటర్ అయ్యి అమెరికాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
ఆ కౌంటర్ ఏంటంటే?
"రూబియోకు గానీ తాజ్ మహల్ చరిత్ర, దాని ఆర్కిటెక్చర్ గురించి తెలిసి ఉంటే.. కచ్చితంగా అక్కడ ఫోటో దిగడానికి ఇష్టపడేవారు కాదు" అని హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ (Iran Consulate in Hyderabad) ఎక్స్ వేదికగా చురకలంటించింది.
"ఒక ఇరానియన్ భార్యపై ఉన్న ప్రేమతో, ఇరానియన్ ఆర్కిటెక్ట్‌ల అద్భుతమైన నైపుణ్యంతో నిర్మించిన కట్టడం అది. కానీ, నేడు ఆయన (రూబియో) ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం.. ఇరానియన్ నాగరికతను తుడిచిపెట్టేస్తామని బెదిరిస్తోంది. ఇతర నాగరికతలను అవమానిస్తోంది" అని ఇరాన్ కాన్సులేట్ ఘాటుగా స్పందించింది. ఇరాన్-అమెరికా మధ్య వివాదం పీక్స్‌లో ఉన్నప్పుడు, ఇరాన్ నాగరికతను నాశనం చేస్తామన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ పరోక్షంగా గుర్తుచేసింది. ఆ సమయంలో, కేవలం 250 ఏళ్ల చరిత్ర ఉన్న అమెరికా.. 6,000 ఏళ్ల చరిత్ర ఉన్న తమను ఏం చేస్తుందంటూ ఇరాన్ మిలిటరీ కమాండర్లు ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.
If Rubio knew the history or architecture, he wouldn't have posed for a picture here. This monument was built out for the love of emperor's Iranian wife, crafted by the genius of Iranian architects — meanwhile his government today threatens to wipe out Iranian civilization,… pic.twitter.com/zi4CNU3u7U
— Iran In Hyderabad (@IraninHyderabad) May 25, 2026
తాజ్ మహల్ - పర్షియన్ కనెక్షన్
ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్ మహల్‌ను 1632లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన మూడో భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించాడు. అయితే దీని మూలాలు పర్షియన్ (Persian) వారసత్వంలో బలంగా నాటుకుపోయాయి.
ముంతాజ్ మహల్ (అసలు పేరు అర్జుమంద్ బాను బేగం) ప్రముఖ పర్షియన్ నోబుల్ ఫ్యామిలీకి చెందిన మహిళ. ఆమె తండ్రి అబ్దుల్ హసన్ అసఫ్ ఖాన్, తాత మీర్జా గియాస్ బేగ్ ఇద్దరూ ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి 1577లో అక్బర్ ఆస్థానానికి వలస వచ్చినవారే. అలాగే, ముంతాజ్ మహల్ తల్లి దివాంజీ బేగం కూడా ఇరాన్‌లోని కజ్వీన్ ప్రాంతానికి చెందిన ఒక గౌరవప్రదమైన పర్షియన్ కుటుంబానికి చెందినవారు.
పర్షియన్ ఆర్కిటెక్చర్‌కి నిలువెత్తు సాక్ష్యం
నేటి ఇరాన్ సరిహద్దుల బయట ఉన్న పర్షియన్ ఆర్కిటెక్చర్‌కి తాజ్ మహల్ ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పవచ్చు. తాజ్ మహల్ పై భాగంలో ఉండే భారీ డబుల్ డోమ్, అద్భుతమైన మార్బుల్ డిజైన్, కచ్చితమైన సమరూపత (Symmetry).. ఇవన్నీ సఫావిద్ పర్షియన్ (Safavid Persian) సంప్రదాయం నుంచి తీసుకున్నవే.
తాజ్ మహల్ ఆవరణలో ఉండే చార్‌బాగ్ (Charbagh) గార్డెన్స్ అన్నీ పర్షియన్ స్టైల్ డిజైన్లే. ఇక పాలరాతి గోడలపై ఉన్న ఖురాన్ వాక్యాలను చెక్కిన ప్రముఖ కాలిగ్రాఫర్ అబ్దుల్-హక్ (Abdul-Haq) కూడా ఇరాన్‌లోని షిరాజ్ ప్రాంతానికి చెందినవారే. ఆయన పనితనానికి ముగ్ధుడైన షాజహాన్ అతనికి 'అమానత్ ఖాన్' అనే బిరుదు కూడా ఇచ్చాడు.
ఇండియన్ క్రాఫ్ట్స్‌మెన్‌షిప్, పర్షియన్ ఆర్కిటెక్చర్‌ల అద్భుత కలయికతో రూపొందిన తాజ్ మహల్ చరిత్ర తెలియక రూబియో అక్కడ ఫోటో దిగారంటూ ఇరాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో అమెరికాను టార్గెట్ చేస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Iran-US Conflict | దోహాలో కీలక చర్చలు.. ఇరాన్ ఎయిర్ బేస్‌పై అమెరికా దాడి..
మే 26, 2026

Marco Rubio in India | భారత్‌పై ట్రంప్ ‘హెల్హోల్’ వ్యాఖ్యలు.. రిపోర్టర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మార్కో రూబియో!
మే 25, 2026

US Iran Ceasefire | అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్? మరో 60 రోజులు కాల్పుల విరమణ.. రంగంలోకి పాక్
మే 23, 2026
తాజావార్తలు
- ●Mekedatu Dam Issue | కావేరీ జలాలపై మళ్లీ రగడ.. మేకేదాటు డ్యామ్‌ను అడ్డుకోవాలని ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
- ●Expenses | ప్రజలకు డబుల్ షాక్.. ఓ వైపు ఇంధన ధరలు, మరో వైపు వంటింటి ఖర్చులు.. భారీగా పెరిగిన వ్యయం..
- ●Harish Rao | జైసల్మేర్‌లో సోలార్ పవర్ ప్లాంట్ ఎందుకు..? ప్రశ్నార్థకంగా సింగరేణి మనుగడ : హరీశ్‌రావు
- ●Rajireddy | కేసీఆర్ పోరుతోనే సత్తుపల్లి, కోయగూడెం బాయిలను ఆపుకున్నాం: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చైర్మన్ రాజిరెడ్డి
- ●Missing Medical Student Mumbai | 47 రోజులుగా మిస్సింగ్.. ముంబై వీధుల్లో బిచ్చగాడిగా మెడికల్ స్టూడెంట్.. గుండెల్ని పిండేసే విషాదం
- ●Kayadu Lohar | కోలీవుడ్ డైరెక్టర్ బయోపిక్‌లో టాలీవుడ్ హీరోయిన్లు - బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్

Mekedatu Dam Issue | కావేరీ జలాలపై మళ్లీ రగడ.. మేకేదాటు డ్యామ్‌ను అడ్డుకోవాలని ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ

Expenses | ప్రజలకు డబుల్ షాక్.. ఓ వైపు ఇంధన ధరలు, మరో వైపు వంటింటి ఖర్చులు.. భారీగా పెరిగిన వ్యయం..

Harish Rao | జైసల్మేర్‌లో సోలార్ పవర్ ప్లాంట్ ఎందుకు..? ప్రశ్నార్థకంగా సింగరేణి మనుగడ : హరీశ్‌రావు

Rajireddy | కేసీఆర్ పోరుతోనే సత్తుపల్లి, కోయగూడెం బాయిలను ఆపుకున్నాం: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చైర్మన్ రాజిరెడ్డి



