త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanjay Singh on Tiger Shroff Firing | గుజరాత్ జైలు నుంచే టైగర్ ష్రాఫ్‌పై దాడికి స్కెచ్

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనతో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. గుజరాత్ జైలు నుంచే గ్యాంగ్ ఎలా నడుపుతున్నారంటూ మోదీ, అమిత్ షాలను ప్రశ్నించారు.

J

National | Published On Oct 19, 2026, 5.00 pm IST

Sanjay Singh on Tiger Shroff Firing | గుజరాత్ జైలు నుంచే టైగర్ ష్రాఫ్‌పై దాడికి స్కెచ్

సంక్షిప్త సారాంశం

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ జైలులో కూర్చుని ఒక గ్యాంగ్‌స్టర్ దాడులు చేయిస్తూ, దానికి బాధ్యత కూడా ప్రకటించుకుంటున్నాడంటే అతనికి ప్రభుత్వ అండదండలు ఉన్నట్లేనని ఆరోపించారు. పంజాబ్ శాంతిభద్రతలపై విమర్శలు చేసే బీజేపీ.. ముందు తమ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో పెరుగుతున్న గూండాగిరీ, మాఫియా, గ్యాంగ్‌వార్‌లపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోనే గ్యాంగ్‌వార్‌లు, కోర్టుల్లో హత్యలు జరుగుతున్నాయని, బీజేపీ వల్ల ఢిల్లీ శాంతిభద్రతలే అదుపు తప్పాయని సంజయ్ సింగ్ మండిపడ్డారు.

Advertisement
  • ప్రభుత్వ అండ లేకుండా ఇంత ధైర్యం వస్తుందా?
  • మోదీ, షాలపై సంజయ్ సింగ్ ఫైర్

Sanjay Singh on Tiger Shroff Firing | త్రినేత్ర న్యూస్ : బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటన ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ దాడి వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ అగ్రనేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రంలోని జైలులో కూర్చుని ఒక గ్యాంగ్‌స్టర్ ఇంత బహిరంగంగా దాడులు ఎలా చేయగలుగుతున్నాడంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఆయన సూటిగా ప్రశ్నించారు.

గుజరాత్ జైలు నుంచే గ్యాంగ్ ఆపరేషన్స్ ఎలా సాధ్యం?

మీడియాతో మాట్లాడిన సంజయ్ సింగ్ ఈ కాల్పుల ఘటనపై కీలక ప్రశ్నలు లేవనెత్తారు. "మీరే ఒక విషయం చెప్పండి.. ఆ గ్యాంగ్‌స్టర్ ఉన్నది బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లోని జైలులో. అక్కడి జైలులో కూర్చునే అతడు తన గ్యాంగ్‌ను నడిపిస్తున్నాడంటే.. దీనికి నేరుగా భారతీయ జనతా పార్టీ, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలే సమాధానం చెప్పాలి" అని ఆయన డిమాండ్ చేశారు. ఒకవైపు గుజరాత్ జైలులో ఉంటూనే.. మరోవైపు టైగర్ ష్రాఫ్‌పై దాడులు చేయించడం, పైగా ఆ దాడికి తామే బాధ్యులమని బహిరంగంగా ప్రకటించుకోవడం చూస్తుంటే అతనికి ఎంత ధైర్యం ఉందో అర్థమవుతోందని సంజయ్ సింగ్ అన్నారు. ప్రభుత్వ సంరక్షణ, అండదండలు లేకుండా జైలు నుంచి ఇంతటి సాహసం చేయడం సాధ్యం కాదని ఆయన ఆరోపించారు.

పంజాబ్‌ను కాదు.. ముందు బీజేపీ రాష్ట్రాలను చూడండి

ఆప్ పాలనలో ఉన్న పంజాబ్‌లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని బీజేపీ పదేపదే చేస్తున్న విమర్శలపై రిపోర్టర్ ప్రశ్నించగా.. సంజయ్ సింగ్ ఘాటుగా బదులిచ్చారు. "దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల రికార్డులను ఒకసారి బయటకు తీసి చూడండి. ఎక్కడ చూసినా గూండాగిరీ, మాఫియా రాజ్యం, గ్యాంగ్‌వార్‌లే కనిపిస్తున్నాయి" అని ఆయన మండిపడ్డారు.

దేశ రాజధాని ఢిల్లీలోనే భద్రత కరువు

మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెట్టి కనీసం దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి చూడాలని సంజయ్ సింగ్ అన్నారు. "దేశ రాజధాని అయిన ఢిల్లీలోనే పట్టపగలు గ్యాంగ్‌వార్‌లు జరుగుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు చేసి, రోడ్లపై కిలోమీటర్ల కొద్దీ ఈడ్చుకెళ్తున్న దారుణాలు చూస్తున్నాం. ఏకంగా కోర్టు ప్రాంగణాల్లోనే హత్యలు జరిగిపోతున్నాయి. వీళ్ల వల్ల ఢిల్లీలోనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కావడం లేదు.. ఇక దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్రైమ్ డేటా తీసి చూస్తే అసలు నిజాలు బయటపడతాయి" అంటూ సంజయ్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement