Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.28వేలు తగ్గిన బంగారం ధర.. వరుస సెషన్లలో నష్టాలు..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ ఈక్విటీ మార్కెట్లలో శుక్రవారం ర్యాలీ కనిపించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఎన్‌విడియా ఆశావహ దృక్పథాన్ని ప్రకటించడం, బలమైన ఆర్థిక ఫలితాలతో ఐటీ షేర్లకు భారీ మద్దతు లభించింది. దీంతో సూచీలు లాభాల్లో ముగిశాయి.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ ఈక్విటీ మార్కెట్లలో శుక్రవారం ర్యాలీ కనిపించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఎన్‌విడియా ఆశావహ దృక్పథాన్ని ప్రకటించడం, బలమైన ఆర్థిక ఫలితాలతో ఐటీ షేర్లకు భారీ మద్దతు లభించింది. దీంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. అయితే బులియన్ మార్కెట్లలో కొనసాగిన బుల్ ర్యాలీకి మాత్రం బ్రేక్ పడింది. దాదాపు వరుసగా మూడు సెషన్లలో ఈ లోహాల ధరలు భారీగా పతనమవుతున్నాయి. శుక్రవారం రాత్రి కమోడిటీ మార్కెట్లు ముగిసే సమయానికి బంగారం, వెండి ధరలు భారీగా పతనాన్ని నమోదు చేశాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 3.18 శాతం పతనమై 4,454 డాలర్లకు చేరగా, వెండి ధర 4.21 శాతం మేర క్షీణించి 66 డాలర్లకు దిగి వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట 2715 పాయింట్లు తగ్గి 1,56,281 వద్ద నిలిచింది. సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 3,947 పాయింట్ల మేర పతనమై 2,36,704 వద్ద స్థిరపడింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్క రోజే రూ.28,900 వరకు ధర తగ్గింది. అయితే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,824 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,26, 592 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,58,240 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,82,400 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.28,900 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,505 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,16,040గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,45,050 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,50,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.26,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,868 ఉండగా, 8 గ్రాముల ధర రూ.94,944గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,18,680 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,86,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.21,700 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..
సెప్టెంబర్ 10, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
సెప్టెంబర్ 9, 2026

Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో మళ్లీ జోష్..
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి
- ●New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి

New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు



