Dhatura | ఆన్‌లైన్‌లో ఉమ్మెత్త పండ్లు, విత్తనాలు.. అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ లైసెన్సులు రద్దు
Dhatura | ప్రముఖ గ్రాసరీ, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌కు కర్ణాటక ప్రభుత్వం (Karnataka) షాక్ఇచ్చింది. ఆన్‌లైన్‌లో విషపూరితమైన ఉమ్మెత్త (Dhatura) పండ్లు, విత్తనాలను ఆహార విభాగంలో అమ్మినందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కీలక చర్యలు తీసుకుంది.
Dhatura | త్రినేత్ర.న్యూస్: ప్రముఖ గ్రాసరీ, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌కు కర్ణాటక ప్రభుత్వం (Karnataka) షాక్ఇచ్చింది. ఆన్‌లైన్‌లో విషపూరితమైన ఉమ్మెత్త (Dhatura) పండ్లు, విత్తనాలను ఆహార విభాగంలో అమ్మినందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కీలక చర్యలు తీసుకుంది. అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ ఫుడ్ లైసెన్సులను (Food Licence) తాత్కాలికంగా సస్పెండ్ (Suspended) చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇది కొనసాగుతుందని స్పష్టం చేసింది. .
ఉమ్మెత్త పండ్లు, విత్తనాలు విషపూరితమైనవని తెలిసినప్పటికీ వాటిని మానవ వినియోగం కోసం ఆన్‌లైన్‌లో అమ్ముతున్నట్లు ఫుడ్ సేఫ్టీ (FDA) అధికారులు గుర్తించారు. కొన్ని ప్యాకెట్లపై ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) ఫుడ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్లు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా ఉమ్మెత్త ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ ఉంచి, ఆన్‌లైన్‌లో విక్రయించినట్లు అధికారులు గుర్తించారు.

ఉమ్మెత్త ఉత్పత్తుల విక్రయంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఫుడ్ సేఫ్టీ శాఖ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా మూడు సంస్థల ప్రతినిధులు అధికారుల ముందు హాజరయ్యారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మరిన్ని వివరాలు, తాము తీసుకున్న చర్యలకు సంబంధించిన పత్రాలను సమర్పించేందుకు అదనపు సమయం కోరింది. ఇప్పటికే ఉమ్మెత్త పండ్ల ఆన్‌లైన్ విక్రయాన్ని నిలిపివేసినట్లు బిగ్‌బాస్కెట్ తెలిపింది. భవిష్యత్తులో ఇటువంటి ఉత్పత్తులపై 'మానవ వినియోగానికి కాదు' అనే స్పష్టమైన లేబులింగ్ చేస్తామని వెల్లడించింది. అమెజాన్ ఈ వ్యవహారంపై తన స్పందనను ఇంకా సమర్పించలేదని అధికారులు తెలిపారు.
సంబంధిత వార్తలు

Supreme Court | ఎఫ్ఎస్ఎస్ఏఐపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం.. ప్రజారోగ్యంపై పట్టింపు లేదని విమర్శలు..
ఆగస్టు 14, 2026

Supreme Court | ఉప్పు..చక్కెర.. ఫ్యాట్ ఎంతుందో.. జనానికి తెలిసేలా డిస్ ప్లే చేయండి? ప్యాకేజ్డ్ ఫుడ్ అంశంలో కేంద్రానికి సుప్రీం అల్టిమేటం
ఆగస్టు 13, 2026

bans sale of gutka | ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గుట్కా, పాన్ మసాలాలపై నిషేధం
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Municipal Elections | డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు.. హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా.!
- ●POWERGRID | పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో అప్రెంటిస్‌లు.. సికింద్రాబాద్ రీజియన్‌లో 22 పోస్టులు
- ●Traffic Restrictions | నేడు మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్‌లో సాయంత్రం 6 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
- ●Horoscope | ఆగస్టు 25 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పదోన్నతులు ఖాయం!
- ●బీఆర్ఎస్ సంస్థాగత సవాళ్లు: రెండు పొరల పార్టీ నిర్మాణం సరిపోతుందా?
- ●One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?

Municipal Elections | డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు.. హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా.!

POWERGRID | పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో అప్రెంటిస్‌లు.. సికింద్రాబాద్ రీజియన్‌లో 22 పోస్టులు

Traffic Restrictions | నేడు మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్‌లో సాయంత్రం 6 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

Horoscope | ఆగస్టు 25 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పదోన్నతులు ఖాయం!



