Dharma Mahesh | నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం..
Dharma Mahesh | హైదరాబాద్ ఫిలింనగర్‌లో (Filmnagar) ఓ కారు బీభత్సం సృష్టించింది. నటుడు ధర్మ మహేశ్ (Dharma Mahesh) ఇంట్లోకి కారు దూసుకెళ్లింది.
Dharma Mahesh | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ ఫిలింనగర్‌లో (Filmnagar) ఓ కారు బీభత్సం సృష్టించింది. నటుడు ధర్మ మహేశ్ (Dharma Mahesh) ఇంట్లోకి కారు దూసుకెళ్లింది. దీంతో గేటు, ప్రహరి గోడ ధ్వంసమయ్యాయి. అయితే ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదు.
నటుడు ధర్మ మహేశ్ ఫిలింనగర్‌లో నివాసం ఉంటున్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక ఓ కారు అదుపుతప్పి ఆయన నివాసంలోకి దూసుకెళ్లింది. అప్రమత్తమైన ధర్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారు మద్యం మత్తులో (Drunk and Drive) ఉన్నట్లు గుర్తించారు. కారు అతివేగం వల్ల అదుపుతప్పడంతో ప్రమాదం జరగిందని తెలిపారు. కాగా, యువకులు కారును నడిపిన తీరు అనుమానాస్పదంగా ఉందని ధర్మ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో కారు వేగం, డ్రైవర్ పరిస్థితి వంటి విషయాలను ఆరాతీస్తున్నారు.
విజయవాడకు చెందిన ధర్మ మహేశ్ అసలు పేరు కాకాని ధర్మ సత్యసాయి శ్రీనివాస మహేశ్. ఇంజినీరింగ్ పూర్తిచేసిన అతడు సినిమాలపై మక్కువతో విశాఖపట్నంలోని సత్యానంద్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. సింధూరం (2023), డ్రింకర్ సాయి (2024) సినిమాల్లో నటించాడు.
A car allegedly driven by intoxicated youth crashed into actor Dharma's residence on Thursday, July 9, in Filmnagar.
The incident occurred on Thursday night, after which one person was detained by the police. A video shared on social media showed the car in a damaged condition… pic.twitter.com/eBROobKmqb
— The Siasat Daily (@TheSiasatDaily) July 10, 2026
తాజావార్తలు
- ●Tihar Jail | తీహార్ జైల్లో పెట్టే ఆహారం తినలేకపోతున్నా.. వంట చేసుకునేందుకు అనుమతివ్వండి.. కోర్టును ఆశ్రయించిన ఖైదీ
- ●Etala Rajendar | నీళ్లెత్తిపోయండని చెప్తున్నాం.. అర్థమవుతుందా రేవంత్‌రెడ్డి గారూ..: ఈటల
- ●Smart Television | LED, QLED, OLED టీవీలు.. ఏది బెస్ట్? తేడాలు తెలుసుకుంటే సరైన ఎంపిక సులభం..
- ●Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!
- ●Kishan Reddy | ప్రత్యేక వెసులుబాటుతో తాడిచర్ల-2 గనిని సింగరేణికి కేటాయించాం: కిషన్‌రెడ్డి
- ●CM Vijay | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. కరూర్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిచ్చేందుకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Tihar Jail | తీహార్ జైల్లో పెట్టే ఆహారం తినలేకపోతున్నా.. వంట చేసుకునేందుకు అనుమతివ్వండి.. కోర్టును ఆశ్రయించిన ఖైదీ

Etala Rajendar | నీళ్లెత్తిపోయండని చెప్తున్నాం.. అర్థమవుతుందా రేవంత్‌రెడ్డి గారూ..: ఈటల

Smart Television | LED, QLED, OLED టీవీలు.. ఏది బెస్ట్? తేడాలు తెలుసుకుంటే సరైన ఎంపిక సులభం..

Planetary Events | స్కైవాచర్లకు గుడ్‌న్యూస్.. ఈ నెలలో కనువిందు చేయనున్న వింతలు ఇవే..!






