CM Vijay | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. కరూర్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిచ్చేందుకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
CM Vijay | కరూర్ తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు (Karur Stampede Victims) ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు మద్రాస్ హైకోర్టు (Madras High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఈ నియామకాలు తాత్కాలికమేనని స్పష్టం చేసింది.
CM Vijay | త్రినేత్ర.న్యూస్ : విజయ్ (CM Vijay) ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో (Madras High Court) భారీ ఊరట లభించింది. కరూర్ తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు (Karur Stampede Victims) ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ నియామకాలు తాత్కాలికమేనని స్పష్టం చేసింది. న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోవడం అత్యంత సంకుచితం అవుతుందని మధురై బెంచ్‌కు చెందిన జస్టిస్ సి.వి. కార్తికేయన్, జస్టిస్ ఆర్. శక్తివేల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది.
గతేడాది కరూర్ తొక్కిసలాటలో మరణించిన 41 మంది కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న టీవీకే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మధురైకి చెందిన న్యాయవాది తీరన్ తిరుమురుగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా .. ప్రభుత్వం ఈ ఉద్యోగాలు ఇవ్వడానికి అనుసరించిన మార్గదర్శకాలు ఏమిటి?.. బాధితుల కుటుంబాలకు ఆ అర్హతలు ఉన్నాయా లేదా..? అనే విషయాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇలాంటి విషాదాలు జరిగినప్పుడు బాధితులకు ఉద్యోగాలు కల్పించే విషయమై ప్రభుత్వం దగ్గర యూనిఫామ్ పాలసీ లేనప్పుడు.. ఇలాంటి నియామకాలు చేపట్టవచ్చా..? లేదా..? అనే అంశాన్ని తాము పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుపై ఉన్న న్యాయపరమైన సవాలు పరిష్కారమయ్యేంత వరకు ఆ నియామకాలు తాత్కాలికంగానే ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెలాఖరులోగా ఈ విషయాన్ని మళ్లీ విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. కాగా, బాధితుల కుటుంబాలకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం విజయ్ నియామక పత్రాలు అందజేయనున్నారు.
సంబంధిత వార్తలు

CM Vijay | మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదు.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
ఆగస్టు 12, 2026

CM Vijay | త్రిషను డిప్యూటీ సీఎం ఎప్పుడు చేస్తారు.. సీఎం విజయ్‌పై దాడికి నటి పేరును అస్త్రంగా వాడుకుంటున్న ప్రతిపక్షాలు
ఆగస్టు 11, 2026

NEET | నీట్‌ను రద్దు చేయాలి.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు
- ●Tejas Express | మారిన తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇకపై ఏమని పిలుస్తారంటే?
- ●Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత
- ●Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్
- ●Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు
- ●NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..

Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు

Tejas Express | మారిన తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇకపై ఏమని పిలుస్తారంటే?

Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత

Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్



