త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ujjaini Mahankali Bonalu | ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాలు.. స‌కాలంలో ప‌నులు పూర్త‌వ్వాలి: డీసీపీ రక్షిత కృష్ణమూర్తి

Ujjaini Mahankali Bonalu | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల (Ujjaini Mahankali Bonalu) జాతర ఏర్పాట్లను డీసీపీ ర‌క్షిత‌ కృష్ణ‌మూర్తి (DCP Rakshitha Krishnamurthy) స‌మీక్షించారు. నిర్దేశిత పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

G

Hyderabad | Published On Jul 10, 2026, 12.14 pm IST

Ujjaini Mahankali Bonalu | ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాలు.. స‌కాలంలో ప‌నులు పూర్త‌వ్వాలి: డీసీపీ రక్షిత కృష్ణమూర్తి
Advertisement

Ujjaini Mahankali Bonalu | త్రినేత్ర‌.న్యూస్‌: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల (Ujjaini Mahankali Bonalu) జాతర ఏర్పాట్లను డీసీపీ ర‌క్షిత‌ కృష్ణ‌మూర్తి (DCP Rakshitha Krishnamurthy) స‌మీక్షించారు. అధికారుల‌తో ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా బోనాల జాతరను అత్యంత వైభవంగా, సురక్షితంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లు, ముందస్తు భద్రతా చర్యలపై చర్చించారు. ఉత్సవాలు విజయవంతం కావడానికి అన్ని శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరమని చెప్పారు. నిర్దేశిత పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి ఉజ్జయిని మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు, పలహారం బండి, తొట్టెల నిర్వాహకులు, వెల్కమ్ స్టేజ్ నిర్వాహకులు, ఇతర ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన 'లష్కర్ బోనాలు'గా ప్రసిద్ధి చెందిన ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్ర‌తి ఏడాది అత్యంత వైభవంగా నిర్వ‌హిస్తారు. ఆషాఢ మాసంలో జరిగే ఈ ఉత్సవాలు జూలై 19న ఘటోత్సవంతో ప్రారంభమై, ఆగస్టు 2న ప్రధాన బోనాల ఉత్సవం, మరుసటి రోజు రంగంతో ముగుస్తుంది. జూలై 19న సాయంత్రం 4 గంటలకు అమ్మవారి ఎదుర్కోలు ఉంటుంది. ఆగస్టు 2న ఉదయం 4 గంటలకు ప్రధాన బోనాల ఉత్సవం నిర్వహిస్తారు. ఆగస్టు 3న ఉదయం 8.30 గంట‌ల‌కు రంగం, 10.30 గంట‌ల‌కు అమ్మవారి గజవాహన ఊరేగింపు జరుగ‌నుంది.

Advertisement
Advertisement