Bhadradri Kothagudem | ఆడుకుంటూ కారెక్కిన చిన్నారి.. అంతలోనే డోర్ లాక్.. తర్వాత ఏమైందంటే!
Bhadradri Kothagudem | ఆ పాపకు నాలుగేళ్లే. కారులో ఎక్కి ఎంచక్కా ఆడుకోవాలనుకుందేమో. అదే తడువుగా ఇంటి ముందున్న కారులోకి ఎంతో మురిపెంగా ఎక్కింది.
Bhadradri Kothagudem | త్రినేత్ర.న్యూస్: ఆ పాపకు నాలుగేళ్లే. కారులో ఎక్కి ఎంచక్కా ఆడుకోవాలనుకుందేమో. అదే తడువుగా ఇంటి ముందున్న కారులోకి ఎంతో మురిపెంగా ఎక్కింది. ఇంతలో డోర్ లాక్ అవడంతో అందులోనే ఉండిపోయింది. దాదాపు రెండు గంటల తర్వాత తల్లిదండ్రులు చూశారు. ఆ తర్వాత ఏమైందంటే..
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్‌కు చెందిన సర్పంచి గంగావత్ నవీన్‌కు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె తన్విశ్రీ (4) ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటోంది. కారులో అయితే ఎవరికి కనపడకుండా ఆడుకోవచ్చనుకుందేమో. అంతలోనే ఇంటి ముందు ఉన్న కారు ఎక్కింది. అనంతరం డోర్ వేసుకోవడంతో అది కాస్త లాక్ అయింది. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ఎంత వెతికినా కనిపించలేదు.
దాదాపు 2 గంటల తర్వాత కారులో చూడగా ముందు భాగంలోనే రెండు సీట్ల మధ్యలో చిన్నారి అపస్మారక స్థితిలో పడిపోయి ఉంది. దీంతో వెంటనే కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని బయటకు తీశారు. ఎంత పిలిచినా పలకకపోవడంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.
ఉదయం ముద్దు ముద్దు మాటలతో మురిపించిన తమ చిన్నారి శాశ్వతంగా దూరమవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇంకొంచెం ముందు చూసుంటే చిన్నారి ప్రాణాలు దక్కేవని గ్రామస్థులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Godavarikhani Young Woman Murdered Case | మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని చంపేశాడు
సెప్టెంబర్ 20, 2026

TG Weather | తెలంగాణలో వానలే వానలు.. ఈ నెల 26 వరకు అతిభారీ వర్షాలే.. ఐఎండీ వార్నింగ్..!
సెప్టెంబర్ 20, 2026

Ponnam Prabhakar | బీసీల లెక్క తేలితేనే వారికి న్యాయం చేయగలం
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Nayanthara | బీచ్ వెకేషన్లో నయనతార - పొట్టి డ్రెస్‌లో అందాలు అదరహో
- ●Siya Goyal Pune crime | బర్త్‌డే సర్ప్రైజ్ పేరుతో ఫేక్ ఇన్‌స్టా వల.. పుణె కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో వెలుగులోకి భయానక నిజాలు
- ●New Blood Group Jama | మరో కొత్త బ్లడ్‌గ్రూప్.. ‘జమా’!
- ●Shriya | శ్రియా తమిళ మూవీకి తొలిరోజు ఆరు లక్షల కలెక్షన్స్ - బెస్ట్ ఫిల్మ్‌గా ప్రభుత్వం అవార్డ్ ఇవ్వడంపై ట్రోల్స్
- ●Godavarikhani Young Woman Murdered Case | మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని చంపేశాడు
- ●INDW vs BANW | ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. శ్రీలంకతో గోల్డ్ మెడల్ పోరు

Nayanthara | బీచ్ వెకేషన్లో నయనతార - పొట్టి డ్రెస్‌లో అందాలు అదరహో

Siya Goyal Pune crime | బర్త్‌డే సర్ప్రైజ్ పేరుతో ఫేక్ ఇన్‌స్టా వల.. పుణె కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో వెలుగులోకి భయానక నిజాలు

New Blood Group Jama | మరో కొత్త బ్లడ్‌గ్రూప్.. ‘జమా’!

Shriya | శ్రియా తమిళ మూవీకి తొలిరోజు ఆరు లక్షల కలెక్షన్స్ - బెస్ట్ ఫిల్మ్‌గా ప్రభుత్వం అవార్డ్ ఇవ్వడంపై ట్రోల్స్



