Rakesh Kumar | విలువైన పాలిటెక్నిక్ కాలేజీల భూముల కోసమే జీవో 97 : చిరుమళ్ల రాకేశ్ కుమార్
Rakesh Kumar | రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యను సర్వనాశనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్ కుమార్ ధ్వజమెత్తారు.
Rakesh Kumar | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యను సర్వనాశనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్ కుమార్ ధ్వజమెత్తారు. పాలిటెక్నిక్ కళాశాలలకు విలువైన భూములున్నాయి .వాటిని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడం కోసమే రేవంత్ రెడ్డి జీవో 97 తెచ్చారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నేను కూడా పాలిటెక్నిక్ నుంచే బీటెక్ చేసి తర్వాత పీహెచ్‌డీ చేశాను. జీవో 97 పాలిటెక్నిక్ విద్యార్థులను ఇంజినీర్లుగా కాకుండా కూలీలుగా మార్చబోతోంది. స్కిల్ యూనివర్సిటీ వీసీగా నియమించిన వ్యక్తి కి కనీస అర్హతలు లేవు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఆ నియామకం జరిగింది. చదువుకోనోళ్లు పీఠమెక్కి చదువుకున్న వాళ్ళను వేధిస్తున్నారు అని రాకేశ్ పేర్కొన్నారు.
కేశవ రావుకు పాలిటెక్నిక్ కళాశాలల భూములపై కన్ను పడిందా ? ఇప్పటికే బిడ్డ, కొడుకులకు అక్రమంగా భూములు సంపాందించి పెట్టారు. భూముల కోసం పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో కేకే ఆడుకుంటారా. పాలిటెక్నిక్ విద్యను పీపీపీ మోడ్‌లో నిర్వహిస్తామని కేకే విద్యార్థులతో ఎలా చెబుతారు..? పాలిటెక్నిక్ విద్యార్థులది న్యాయమైన డిమాండ్.. జీవో 97 రద్దుకు కేకే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. గతంలో విప్లవోద్యమాలు పాలిటెక్నిక్ కాలేజీల నుంచే పుట్టాయి. జీవో 97 రద్దు చేయకపోతే పాలిటెక్నిక్ కాలేజీల నుంచే రేవంత్ ప్రభుత్వం పతనం మొదలవుతుందని రాకేశ్ హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Modi Chalisa | జై జై మోదీ.. హర హర మోదీ.. ఢిల్లీ ప్రెస్ క్లబ్లో మోదీ చాలీసా విడుదల
- ●Vinayaka Chavithi | సెప్టెంబర్ 14న చవితి.. 25న నిమజ్జనం
- ●Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోకు తల్లిగా దీపికా పడుకోణ్ - అలియాభట్ బ్లాక్బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్!
- ●Amit Shah | స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోంది : అమిత్ షా
- ●Gunja Renuka | కొండా సుష్మిత.. కాంగ్రెస్లో కవిత అవుదాం అనుకుంటుందా..?
- ●Alleti Maheshwar Reddy | పొంగులేటి రాజీనామా చేయాల్సిందే

Modi Chalisa | జై జై మోదీ.. హర హర మోదీ.. ఢిల్లీ ప్రెస్ క్లబ్లో మోదీ చాలీసా విడుదల

Vinayaka Chavithi | సెప్టెంబర్ 14న చవితి.. 25న నిమజ్జనం

Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోకు తల్లిగా దీపికా పడుకోణ్ - అలియాభట్ బ్లాక్బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్!

Amit Shah | స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోంది : అమిత్ షా






