TRP Free Coaching | నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్‌లో 100 రోజుల ఉచిత కోచింగ్
TRP Free Coaching | నిరుద్యోగ యువత భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వేదికగా 100 రోజుల ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు.
TRP Free Coaching | త్రినేత్ర.న్యూస్ : నిరుద్యోగ యువత భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వేదికగా 100 రోజుల ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌లను గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో తీన్మార్ మల్లన్న గారి చేతుల మీదుగా విడుదల చేశారు.
నిరుద్యోగులపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యం
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో భారీ ఫీజులు చెల్లించి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి ఉచితంగా శిక్షణ అందించి ఉద్యోగ సాధనలో తోడ్పడటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని మల్లన్న గారు పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రతిభ ఉన్న యువత వెనుకబడకూడదనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఇప్పటికే వేల మందికి అండగా పార్టీ ఎడ్యుకేషన్ యాప్
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పటికే తమ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా విద్యా సేవలు అందిస్తోందని తెలిపారు. ఇప్పుడు ప్రత్యక్ష శిక్షణ ద్వారా మరింత మంది యువత ఉద్యోగాలు సాధించేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌ను నింపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మల్లన్న గారు పిలుపునిచ్చారు. ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమం నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశంగా నిలిచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండు వినోద్,కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి చిగుర్ల మోహన్, సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ మనోజ్ ఆకుల, రాష్ట్ర యువజన విభాగ సహాయక కార్యదర్శి మహబూబ్ అలీ, రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు జింక లావణ్య, జిల్లా మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ అంకుష్ శావాలి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీకాంత్, కొత్తపెళ్లి మండల అధ్యక్షులు ఓర్సు రాజు, నాయకులు సుతారి సధానందం, చందు, ధర్మారాపు అనిల్, కోరేపు గంగ, గుండోజు సధానందం, గుండోజు పద్మ, వాసాల భాను చెందర్, లక్ష్మీ, కార్తీక్, మోహన్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Teenmar Mallanna vs Birla Ilaiah | సొంత పార్టీ బీఫామ్‌పై గెలిచే దమ్ముందా? తీన్మార్ మల్లన్నకు బీర్ల ఐలయ్య ఓపెన్ చాలెంజ్!
ఆగస్టు 15, 2026

CM Revanth Reddy | మాయగాళ్ల మాయలో పడకండి.. ప్రతి 6 నెలలకు ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 15, 2026

Un Employees | మా కంటే అర్జంట్ పనేం ఉంటది సర్.. కోదండరాంను నిలదీసిన నిరుద్యోగులు
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
- ●Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?
- ●Rakesh Kumar | విలువైన పాలిటెక్నిక్ కాలేజీల భూముల కోసమే జీవో 97 : చిరుమళ్ల రాకేశ్ కుమార్
- ●Reliance Industries | ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 30 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్లు..
- ●Modi Chalisa | జై జై మోదీ.. హర హర మోదీ.. ఢిల్లీ ప్రెస్ క్లబ్లో మోదీ చాలీసా విడుదల
- ●Vinayaka Chavithi | సెప్టెంబర్ 14న చవితి.. 25న నిమజ్జనం

Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?

Rakesh Kumar | విలువైన పాలిటెక్నిక్ కాలేజీల భూముల కోసమే జీవో 97 : చిరుమళ్ల రాకేశ్ కుమార్

Reliance Industries | ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 30 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్లు..



