Tihar Jail | తీహార్ జైల్లో పెట్టే ఆహారం తినలేకపోతున్నా.. వంట చేసుకునేందుకు అనుమతివ్వండి.. కోర్టును ఆశ్రయించిన ఖైదీ
Tihar Jail | తీహార్ జైల్లో (Tihar Jail) పెట్టే ఆహారం తాను తినలేకపోతున్నానని అమెరికన్ ఖైదీ (American prisoner) మాథ్యూ ఆరన్ వాన్‌డైక్ (Matthew Aaron VanDyke) కోర్టును ఆశ్రయించాడు. జైల్లోనే తాను స్వయంగా వంట చేసుకునేందుకు అనుమతించాలని అభ్యర్థించాడు. పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
Tihar Jail | తీహార్ జైల్లో (Tihar Jail) పెట్టే ఆహారం తాను తినలేకపోతున్నానని అమెరికన్ ఖైదీ (American prisoner) మాథ్యూ ఆరన్ వాన్‌డైక్ (Matthew Aaron VanDyke) కోర్టును ఆశ్రయించాడు. జైల్లో పెట్టే ఆహారంలో మసాలా, కారం, నూనె ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు. ఆ ఆహారం తన ఒంటికి పడట్లేదని పేర్కొన్నాడు. జైల్లోనే తాను స్వయంగా వంట చేసుకునేందుకు అనుమతించాలని అభ్యర్థించాడు. ఈ మేరకు పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
కారం, నూనె ఎక్కువగా ఉండే డీఫ్రై చేసిన ఆహారాన్ని తాను తినలేకపోతున్నానని పిటిషన్‌లో పేర్కొన్నాడు. 50 రోజులకుపైగా ఆహారం తినకుండా పస్తులు ఉన్నట్లు చెప్పాడు. అమెరికన్ పౌరుడినైన తాను.. ఇక్కడి జైల్లో వడ్డించే సాధారణ భోజనం తనకు అలవాటు లేదని తెలిపాడు. ఈ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం క్షీణించిందని చెప్పుకొచ్చాడు. సరైన పోషకాహారం లేకపోవడం వల్ల తాను దాదాపు 14 కిలోల బరువు తగ్గానని, చూపు కూడా మందగించిందని, శరీరక దారుఢ్యం, రోగ నిరోధక శక్తి సన్నగిల్లాయని పిటిషన్‌లో తన గోడు వెళ్లబోసుకున్నాడు.
అందుకే జైల్లో తన వంటను తానే వండుకునేందుకు అనుమతించాలని కోరాడు. తన సొంత ఖర్చులతో వంట సామగ్రి, ఆహార పదార్థాలను సమకూర్చుకుంటానని చెప్పాడు. పప్పులు, చికెన్, చేపలు, పాస్తా, నూడిల్స్, బియ్యం, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, బీన్స్, మసాలాలు, బ్రెడ్, బటర్, ఆలివ్ ఆయిల్, టోన్డ్ మిల్క్ వంటి ఆహార పదార్థాలను తన వద్ద ఉంచుకోవడానికి అనుమతించాలని వాన్‌డైక్ కోరాడు. వీటితో పాటు, తాను సొంతంగా వంట చేసుకోవడానికి వీలుగా ఒక ఇండక్షన్ స్టవ్, పాత్రలు, గిన్నెలు, ప్లాస్టిక్ చాపర్ అనుమతించాలని అభ్యర్థించాడు.
తన అభ్యర్థనను మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి ప్రశాంత్ శర్మ.. దీనిపై స్పందించాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణను జులై 21కి వాయిదా వేశారు.
భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో మ్యాథ్యూని మార్చి 13న కోల్‌కతా ఎయిర్‌పోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. అతడితోపాటూ ఆరుగురు ఉక్రేనియన్లను కూడా అదుపులోకి తీసుకుంది. నిషేధిత చొరబాటు దారులతో వీరికి సంబంధాలు ఉన్నాయని, వారికి ఆయుధాలు, పరికరాలు సప్లై చేస్తున్నారని అధికారులు తెలిపారు. టూరిస్టు వీసాపై వచ్చిన వీరు తొలుత అస్సాం మీదుగా గువాహటీకి వెళ్లారు. అక్కడి నుంచి మిజోరాంకు ప్రయాణించారు. అక్కడి నుంచి ఎలాంటి అనుమతులూ లేకుండా మయన్మార్‌లోకి ప్రవేశించి.. నిషేధిత మిలిటెంట్ సంస్థలకు శిక్షణ ఇచ్చారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నట్లు విచారణలో నిందితులు అంగీకరించినట్లు తెలిపింది. దీంతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది.
సంబంధిత వార్తలు

Jacqueline Fernandez | నేను నిర్దోషినే.. విచారణ ఎదుర్కొంటా.. కోర్టులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వాదనలు
జూన్ 3, 2026

Food | బరువు తగ్గాలని భోజనం మానేస్తున్నారా.. అలా చేయొద్దంటున్న వైద్యులు..
మే 28, 2026

Money Laundering Case | అప్రూవర్‌గా మారేందుకు సిద్ధం.. కోర్టులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●CM Vijay | కరూర్ ఘటన పక్కా కుట్ర.. సిగ్గులేకుండా నాపై నిందలేశారు : సీఎం విజయ్
- ●Medipally Satyam | అసలు పిచ్చి లేసింది హరీశ్‌రావుకే.. ఆయనకు రేవంత్ ఫోబియా పట్టుకుంది
- ●ChatGPT Work | చాట్ జీపీటీ వర్క్ మోడల్ వచ్చేసింది.. ఇక గంటల తరబడి ఏఐని వాడవచ్చు..
- ●Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీకి వెరైటీ టైటిల్ ఫిక్స్ - నాలుగు భాషల్లో రిలీజ్
- ●Vakiti Srihari | రూ. 47.03 కోట్లతో హోల్ సేల్ చేపల మార్కెట్
- ●ITR Filing | ఐటీఆర్ రీఫండ్ ఇక వేగంగా.. 7-10 రోజుల్లోనే ఖాతాలో డబ్బు.. స్టేటస్ ఇలా చెక్ చేయండి..

CM Vijay | కరూర్ ఘటన పక్కా కుట్ర.. సిగ్గులేకుండా నాపై నిందలేశారు : సీఎం విజయ్

Medipally Satyam | అసలు పిచ్చి లేసింది హరీశ్‌రావుకే.. ఆయనకు రేవంత్ ఫోబియా పట్టుకుంది

ChatGPT Work | చాట్ జీపీటీ వర్క్ మోడల్ వచ్చేసింది.. ఇక గంటల తరబడి ఏఐని వాడవచ్చు..

Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీకి వెరైటీ టైటిల్ ఫిక్స్ - నాలుగు భాషల్లో రిలీజ్



