త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Forest Officer | జింక‌కు పోహా తినిపించిన అట‌వీ అధికారి.. స‌స్పెండ్‌.. వీడియో

Forest Officer | త్రినేత్ర‌.న్యూస్‌: అత‌నో అట‌వీ అధికారి (Forest Officer). తాను తెచ్చుకున్న ఆహారాన్ని అడ‌వి జింక‌కు (Sambar Deer) తినిపించాడు. దానిని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.

G

National | Published On Jun 28, 2026, 9.59 am IST

Forest Officer | జింక‌కు పోహా తినిపించిన అట‌వీ అధికారి.. స‌స్పెండ్‌.. వీడియో
Advertisement

Forest Officer | త్రినేత్ర‌.న్యూస్‌: అత‌నో అట‌వీ అధికారి (Forest Officer). తాను తెచ్చుకున్న ఆహారాన్ని అడ‌వి జింక‌కు (Sambar Deer) తినిపించాడు. దానిని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అత‌నిపై స‌స్పెన్ష‌న్ వేటు (Suspended)ప‌డింది. విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌హ‌రించిన ఆ అధికారిపై వన్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టాన్ని ఉల్లంఘించారంటూ అట‌వీ శాఖ‌ చ‌ర్య‌లు తీసుకుంది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని స‌త్పురా టైగ‌ర్ రిజ‌ర్వ్‌లో చోటుచేసుకుంది.

వినోద్ వ‌ర్మ (Vinod Verma) అనే అధికారి సత్పురా టైగర్ రిజర్వ్‌లోని (Satpura Tiger Reserve) బోరి రేంజ్ ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయ‌న ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. దాని ప్ర‌కారం.. చుర్నా అటవీ ప్రాంతంలో ఓ అడవి సాంబార్ జింకకు పోహా తినిపిస్తూ (Feeding Poha) క‌నిపించారు. ఆహారం పెడుతూ దానిని నిమురుతున్నారు. అదికాస్తా వైర‌ల్ కావ‌డంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వినోద్ వర్మను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. విధి నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించారని, మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నియమావళి-1965లోని నిబంధన 3ను ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు.

Advertisement
Advertisement