త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

VD Savarkar | క్విజ్‌లో సావ‌ర్క‌ర్‌పై ప్ర‌శ్న‌.. ఉపాధ్యాయుడి స‌స్పెన్ష‌న్‌.. హైకోర్టు స్టే

VD Savarkar | పంద్రాగ‌స్టు సంద‌ర్భంగా స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల (Freedom Fighter) గురించి పాఠ‌శాల స్థాయిలో క్విజ్ నిర్వ‌హించారు. అందులో అడిగిన ఒక ప్ర‌శ్న (Quiz Question) వివాదానికి దారితీసింది.

G

National | Published On Aug 20, 2026, 8.07 am IST

VD Savarkar | క్విజ్‌లో సావ‌ర్క‌ర్‌పై ప్ర‌శ్న‌.. ఉపాధ్యాయుడి స‌స్పెన్ష‌న్‌.. హైకోర్టు స్టే
Advertisement

VD Savarkar | త్రినేత్ర‌.న్యూస్‌: పంద్రాగ‌స్టు సంద‌ర్భంగా స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల (Freedom Fighter) గురించి పాఠ‌శాల స్థాయిలో క్విజ్ నిర్వ‌హించారు. అందులో అడిగిన ఒక ప్ర‌శ్న (Quiz Question) వివాదానికి దారితీసింది. దీంతో ప్ర‌శ్న‌ప‌త్రం రూపొందించిన ఉపాధ్యాయుడిపై అధికారులు చ‌ర్య‌లు (Suspended) తీసుకున్నారు. దీంతో అత‌డు హైకోర్టుకు వెళ్ల‌డంతో స్టే విధించింది.

కేర‌ళ‌లోని (Kerala) కాసర్‌గోడ్ జిల్లాలో స్వాతంత్య్ర దినోత్స‌వం నేప‌థ్యంలో లోయర్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ విద్యార్థులకు ఆగస్టు 6న పాఠ‌శాల స్థాయిలో సోషల్ సైన్స్ క్లబ్ ఫ్రీడమ్ క్విజ్ (Freedom Quiz) నిర్వ‌హించారు. అందులో బ్రిటీష్ వారి చేతిలో అత్య‌ధిక శిక్ష పొందిన స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఎవ‌రు? అని హిందుత్వ సిద్ధాంత‌క‌ర్త వీడీ సావ‌ర్క‌ర్‌పై (VD Savarkar) ఓ ప్ర‌శ్న రూపొందించారు. ఆ ప్ర‌శ్న కాస్త వివాదాస్ప‌దం కావ‌డంతో ఈ నెల 13న విద్యాశాఖ డైరెక్టర్ జనరల్ స్నేహిల్ కుమార్ సింగ్ ప్ర‌శ్న‌ప‌త్రం రూపొందించిన అప్ప‌ర్ ప్రైమ‌రీ స్కూల్ ఉపాధ్యాయుడు కే. గురుప్ర‌సాద్ రాయ్‌ని (Guruprasad Rai K) సస్పెండ్ చేశారు. ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ‌కు ఆదేశించారు. దీంతో ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను స‌వాల్ చేస్తూ ఆ ఉపాధ్యాయుడు హైకోర్టును ఆశ్ర‌యించారు.

దీనిపై విచార‌ణ ప్రారంభించిన జ‌స్టిస్ విజ‌య్ అబ్ర‌హం.. ఆరోప‌ణ‌ల స్వభావం దృష్ట్యా విచార‌ణ స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డానికి రాయ్‌పై స‌స్పెన్ష‌న్ కొన‌సాగించ‌డం అవ‌స‌రం లేద‌ని వ్యాఖించారు. అత‌నిపై విధించిన స‌స్పెన్ష‌న్‌ను నెల రోజుల‌పాటు నిలిపివేస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీచేశారు. విచార‌ణ కొన‌సాగించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ప్ర‌శ్న‌ప‌త్రాన్ని రూపొందించిన రాయ్‌.. దానిని జిల్లా అద‌న‌పు విద్యాధికారికి (AEO) పంపించార‌ని, ఆ త‌ప్పుడు ప్ర‌శ్న గురించి ఆయ‌న‌కు కూడా ఉంటుంద‌ని పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ ఎలాంటి అభ్యంత‌రం తెల‌ప‌క‌పోవ‌డంతో ఆ ప్ర‌శ్న‌ప‌త్రాన్ని పాఠ‌శాల‌ల‌కు పంపిణీ చేశార‌ని తెలిపింది. అయినా ఏఈఓపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది. సస్పెండ్ చేసేలా ఉపాధ్యాయుడు ఏ చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడ్డార‌ని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉపాధ్యాయుడి ఉద్దేశం మ‌రొక‌టి కావ‌చ్చు, కానీ కేవలం ఒక తప్పుడు ప్రశ్న అడిగినందుకు అతడిని సస్పెండ్ చేస్తారా అని పేర్కొంది. కేసు విచార‌ణ‌ను సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది.

Advertisement
Advertisement