Shadab Hotel | షాదాబ్ హోటల్ లైసెన్స్ రద్దు.. ఎందుకంటే!
Shadab Hotel | హైదరాబాద్ ఓల్డ్‌సిటీ మదీనాలోని (Madina) ప్రముఖ హోటల్ షాదాబ్ కేఫ్ (Shadab Hotel) లైసెన్సును టీజీ సేఫ్ అధికారులు రద్దు చేశారు. పారిశుద్ధ్య లోపం, అపరిశుభ్రత మధ్య మాంసం నిల్వ చేయడం, కిచెన్‌లో అపరిశుభ్రత లాంటి ఉల్లంఘనలు ఉండటంతో హోటల్‌ను సీజ్ చేశారు.
Shadab Hotel | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ ఓల్డ్‌సిటీ మదీనాలోని (Madina) ప్రముఖ హోటల్ షాదాబ్ కేఫ్ (Shadab Hotel) లైసెన్సును టీజీ సేఫ్ అధికారులు రద్దు చేశారు. పారిశుద్ధ్య లోపం, అపరిశుభ్రత మధ్య మాంసం నిల్వ చేయడం, కిచెన్‌లో అపరిశుభ్రత లాంటి ఉల్లంఘనలు ఉండటంతో హోటల్‌ను సీజ్ చేశారు. వ్యాపార కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని (Hyderabad) కేఫ్‌లు, స్నాక్ పాయింట్లపై తెలంగాణ స్టాండర్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన 9 ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాయి. ఆహార భద్రతాధికారులు, పోలీసుల భాగస్వామ్యంతో మొత్తం 19 కెఫేల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మదీనాలోని షాదాబ్ కేఫ్‌లో చికెన్, మటన్ వంటి మాంసం ఉత్పత్తులను నిబంధనలకు విరుద్ధంగా నిల్వఉంచడంతోపాటు, కిచెన్ పరిసరాల్లో బొద్దింకలు, ఇతర కీటకాలు సంచరించడాన్ని గుర్తించారు. ఫాసీ లైసెన్స్‌ను (FSSAI licence) రద్దుచేశారు. వ్యాపార కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.
అదేవిధంగా లైసెన్సులు లేకుండా నడుపుతున్న డ్రీమ్స్‌కేఫ్ (బాగ్‌లింగంపల్లి), ఆసియాటిక్ కేఫ్ (పంజాగుట్ట) అధికారులు మూయించారు. వీటితోపాటు ఉల్లంఘనలకు పాల్పడిన కేఫ్ పర్షయా, బాహర్ బిర్యాని కేఫ్, కేఫ్ డెక్కన్, హనీమూన్ కేఫ్, రియో రెస్టారెంట్, ఆరోమెల్ హాస్పిటాలిటీ, ఫ్రెండ్స్ అండ్ కేఫ్, డైమండ్ పాయింట్ హోటల్, హోటల్ ఉమ్రోజ్, బ్లూసీ టీ అండ్ స్నాక్స్, నిమ్రా కేఫ్ అండ్ బేకరీ, గుల్జార్ ఫుడ్స్ వంటి హోటళ్లకు షోకాజ్ నోటీసులు (Show Cause Notices), ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు ఇచ్చారు.
తాజావార్తలు
- ●Surabhi Vanidevi | క్యూర్ బిల్లును మమ అనిపించారు
- ●Xi Jinping Skips Modi Dinner | మోదీ ఇచ్చిన డిన్నర్‌కు జిన్‌పింగ్ డుమ్మా: సదస్సుకు వచ్చి విందుకు ఎందుకు పోలేదు?
- ●Deshapathi Srinivas | రేవంత్‌ది విజన్ లేని పాలనే కాదు.. వజన్ లేని పాలన కూడా
- ●Daman Tourism | ఒకప్పుడు ‘మందు’ అడ్డా.. ఇప్పుడో అద్భుతం: ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!
- ●Nagarjuna | పర్యావరణ హితం కోసం సీడ్ గణేషుడినే పూజించండి - అక్కినేని నాగార్జున పిలుపు
- ●TRS | టీఆర్ఎస్లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి.. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ

Surabhi Vanidevi | క్యూర్ బిల్లును మమ అనిపించారు

Xi Jinping Skips Modi Dinner | మోదీ ఇచ్చిన డిన్నర్‌కు జిన్‌పింగ్ డుమ్మా: సదస్సుకు వచ్చి విందుకు ఎందుకు పోలేదు?

Deshapathi Srinivas | రేవంత్‌ది విజన్ లేని పాలనే కాదు.. వజన్ లేని పాలన కూడా

Daman Tourism | ఒకప్పుడు ‘మందు’ అడ్డా.. ఇప్పుడో అద్భుతం: ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!





