త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Leopard | వికారాబాద్ జిల్లాలో చిరుత క‌ల‌క‌లం.. రైతుపై దాడికి య‌త్నం

Leopard | వికారాబాద్ జిల్లా ప‌రిగి మండ‌ల ప‌రిధిలోని న‌ష్క‌ల్ గ్రామంలో చిరుత పులి క‌ల‌క‌లం సృష్టించింది. ఆదివారం త‌న పొలంలో ప‌ని చేసుకుంటున్న ఓ రైతుపై చిరుత పులి దాడికి య‌త్నించింది.

S

Telangana | Published On Nov 22, 2026, 5.55 pm IST

Leopard | వికారాబాద్ జిల్లాలో చిరుత క‌ల‌క‌లం.. రైతుపై దాడికి య‌త్నం
Advertisement

Leopard | త్రినేత్ర న్యూస్ : వికారాబాద్ జిల్లా ప‌రిగి మండ‌ల ప‌రిధిలోని న‌ష్క‌ల్ గ్రామంలో చిరుత పులి క‌ల‌క‌లం సృష్టించింది. ఆదివారం త‌న పొలంలో ప‌ని చేసుకుంటున్న ఓ రైతుపై చిరుత పులి దాడికి య‌త్నించింది. చిరుత క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించిన రైతు.. అక్క‌డ్నుంచి పారిపోయాడు.

చిరుత సంచారంపై వికారాబాద్ జిల్లా అట‌వీశాఖ అధికారుల‌కు రైతు స‌మాచారం అందించాడు. దీంతో అట‌వీశాఖ అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. పంట పొలాల్లోకి వెళ్లే రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, చిరుత క‌ద‌లిక‌లు గ‌మ‌నిస్తే వెంట‌నే స‌మాచారం అందించాల‌ని ఫారెస్ట్ ఆఫీస‌ర్ విశాల్ బ‌త్తుల సూచించారు. కొద్ది రోజుల క్రితం దోమ మండ‌ల ప‌రిధిలో కూడా చిరుత సంచ‌రించింద‌ని పేర్కొన్నారు.

Advertisement
Advertisement