BIG TV Chairman | రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. క్షణాల్లో 12 లక్షలు పంపిన బిగ్ టీవీ ఛైర్మన్
BIG TV Chairman | యాజమాన్యాలంటే పని చేయించుకోవడం తప్ప ఉద్యోగుల బాగోగులు కనీసంగా పట్టించుకోని పరిస్థితుల్లో బిగ్ టీవీ చైర్మన్ విజయ్‌కుమార్‌రెడ్డి మంచి మనసును చాటుకున్నారు.
- విజయ్‌కుమార్‌రెడ్డిపై బిగ్ టీవీ సిబ్బంది, జర్నలిస్టుల ప్రశంసల జల్లు
BIG TV Chairman | త్రినేత్ర న్యూస్: యాజమాన్యాలంటే పని చేయించుకోవడం తప్ప ఉద్యోగుల బాగోగులు కనీసంగా పట్టించుకోని పరిస్థితుల్లో బిగ్ టీవీ చైర్మన్ విజయ్‌కుమార్‌రెడ్డి మంచి మనసును చాటుకున్నారు. ఢిల్లీలో బిగ్ టీవీ రిపోర్టర్‌గా పని చేస్తున్న శివ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవగా క్షణాల్లో 12 లక్షల ఆర్థిక సాయం అందించి ఔదార్యం చూపించారు. నిండు ప్రాణాలు నిలబెట్టిన చైర్మన్ మానవత్వంపై జర్నలిస్టులు, ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ఢిల్లీ రిపోర్టర్‌గా పని చేస్తున్న శివకు గురువారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎడమ చేయి, కాలు చచ్చుబడిపోయింది. కంగారుపడిన అతని భార్య.. వాళ్లకు దగ్గరగా ఉండే తెలుగు టీవీ, పత్రికల రిపోర్టర్లకు వెంటనే ఈ విషయాన్ని తెలియజేసింది. హుటాహుటిన శివ ఇంటికి చేరుకున్న ఎన్టీవీ రాజు, టీవీ9 గోపి, ఆంధ్రజ్యోతి సూర్య కిరణ్.. శివను వెంటనే మాక్స్ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స కోసం 12 లక్షల రూపాయలు అవుతాయని వైద్యులు చెప్పడంతో ఈ విషయాన్ని బిగ్ టీవీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన చైర్మన్ బిగ్ టీవీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి 12 లక్షల రూపాయలను ఆస్పత్రికి పంపించారు. వెంటనే వైద్యులు చికిత్స చేయడంతో శివ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
బిగ్ టీవీ చైర్మన్ పెద్ద మనసుకు సదరు టీవీ సిబ్బందితో పాటు ఇతర మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు చెబుతున్నారు. ఓ యాజమాన్యం ఒక ఉద్యోగి కోసం ఇంత మొత్తంలో ఖర్చు పెట్టడం ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని పలువురు రిపోర్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తోటి రిపోర్టర్ ఆసుపత్రిలో చేరగానే.. ఢిల్లీలోని తెలుగు మీడియా ప్రతినిధులందరూ ఆసుపత్రికి చేరుకొని శివ కుటుంబానికి అండగా నిలబడి ఆదర్శంగా నిలవడం విశేషం.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Strait of Hormuz Cargo Ship Sinking | హార్మూజ్ జలసంధిలో మునిగిన కార్గో నౌక.. సముద్రంలో తేలియాడుతున్న ఐఫోన్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు
- ●Anupama Parameswaran | పెళ్లికి ముందే బిడ్డను కనాలనుంది - అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్
- ●Tata Play Smart | ఇక సెట్‌టాప్ బాక్స్ అవసరం లేదు.. రూ.199కే 500కు పైగా టీవీ ఛానల్స్..
- ●Ponnam Prabhakar | చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలి
- ●Dasoju Sravan Kumar | కేటీఆర్ బొచ్చుపై రాజకీయం చేస్తే కరెంట్ రాదు
- ●Abhijeet Dipke CJP | జ్ఞానేష్ కుమార్ కోసం సొంత దేశ ప్రజలపైనే యుద్ధం చేస్తున్నారు

Strait of Hormuz Cargo Ship Sinking | హార్మూజ్ జలసంధిలో మునిగిన కార్గో నౌక.. సముద్రంలో తేలియాడుతున్న ఐఫోన్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు

Anupama Parameswaran | పెళ్లికి ముందే బిడ్డను కనాలనుంది - అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్

Tata Play Smart | ఇక సెట్‌టాప్ బాక్స్ అవసరం లేదు.. రూ.199కే 500కు పైగా టీవీ ఛానల్స్..

Ponnam Prabhakar | చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలి





