Bullet Train | దేశంలోనే మొట్ట మొదటి ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
Bullet Train | దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైస్పీడ్ బుల్లెట్ రైలు (Bullet Train) ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) కీలక అప్‌డేట్ ఇచ్చింది. అహ్మదాబాద్-ముంబై (Mumbai To Ahmedabad) మధ్య నడవనున్న దేశంలోనే మొట్ట మొదటి ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్‌ను సోమవారం ఆవిష్కరించింది.
Bullet Train | దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైస్పీడ్ బుల్లెట్ రైలు (Bullet Train) ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railways) కీలక అప్‌డేట్ ఇచ్చింది. అహ్మదాబాద్-ముంబై (Mumbai To Ahmedabad) మధ్య నడవనున్న దేశంలోనే మొట్ట మొదటి ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్‌ను సోమవారం ఆవిష్కరించింది. హైస్పీడ్ రైలుకు సంబంధించిన చిత్రాన్ని న్యూఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసింది. గేట్ నంబర్ 4 వద్ద ప్రదర్శనకు ఉంచింది. ఆధునిక హంగులతో, ఏరోడైనమిక్ డిజైన్‌తో మెరిసిపోతున్న ఈ రైలు భారత రైల్వే రూపురేఖలను మార్చేయనుంది.
ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్‌ను 2027 ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే.. రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్ చేరుకోవడానికి రైలులో సుమారు 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. అయితే, బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం కేవలం 2 నుంచి 3 గంటలకు తగ్గిపోనుంది.
అహ్మదాబాద్-ముంబై ఈ హై-స్పీడ్ కారిడార్ మొత్తం 508 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను అనుసంధానిస్తూ సాగే ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లను నిర్మించనున్నారు. 1.98 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ మార్గం ఎనిమిది హై-స్పీడ్ రైల్ ప్రాజెక్టుల్లో మొట్టమొదటిది. ఈ ప్రాజెక్టులో అనేక ఇంజనీరింగ్ సవాళ్లు ఉన్నాయి. ఈ కారిడార్‌లో మొత్తం 8 పర్వత సొరంగాలు (Mountain Tunnels) నిర్మిస్తున్నారు. వీటిలో 7 మహారాష్ట్రలో ఉండగా, ఒక్కటి గుజరాత్‌లో ఉంది. కేవలం పర్వతాలే కాదు, సముద్ర గర్భం నుంచి కూడా రైలు వెళ్లేలా థానే క్రీక్ వద్ద ప్రత్యేక సొరంగాన్ని నిర్మిస్తున్నారు. 2017 సెప్టెంబర్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
Also Read..
హైదరాబాద్ టు ముంబై జస్ట్ 3 గంటలే: రెడీ అయిన 'బుల్లెట్ రైలు' కారిడార్ డీపీఆర్
నేనెప్పుడూ అతడిని కలవలేదు - డేటింగ్ రూమర్లపై శ్రీలీల క్లారిటీ
ఏసీని కొనాలంటే త్వరపడండి.. త్వరలో భారీగా పెరగనున్న ధరలు..?
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్





