లోడ్ అవుతోంది...


India's First Bullet Train | బుల్లెట్ రైలు గురించి ఇప్పటి వరకు మనం విన్నాం. కానీ ఇక నుంచి ప్రత్యక్షంగా చూడబోతున్నాం. భారత్‌లో తొలి బుల్లెట్ రైలుకు పునాది పడింది. బుల్లెట్ రైలు పనులు వేగవంతం అవుతున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే సంవత్సరం అంటే 15 ఆగస్టు 2027 లోపు బుల్లెటు రైలు భారత్‌లో జెట్ స్పీడ్‌తో పరుగులు పెట్టనుంది.
ముంబై-అహ్మదాబాద్ రూట్‌లో తొలి బుల్లెట్ రైలు నడవనుంది. అందుకోసం ముంబై- అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్‌ను రైల్వే శాఖ నిర్మిస్తోంది. 508 కిమీల దూరం ఉన్న ఈ కారిడార్‌లో బుల్లెట్ రైలు ముంబైలోని బాందా కుర్లా కాంప్లెక్స్ నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి వరకు నడుస్తుంది. అంటే మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా అండ్ నగర్ హవేలీ రాష్ట్రాలను కలుపుకుంటూ ఈ రైలు పరుగులు తీస్తుంది.
ఈ రైలు కనీసం 300 నుంచి 320 కేఎంపీహెచ్ స్పీడ్‌తో పరుగులు పెట్టనుంది. జపాన్‌కి చెందిన షింకన్‌సేన్ టెక్నాలజీతో ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. కేవలం రెండు గంటల్లో 508 కిమీల దూరాన్ని చేరుకునేలా కారిడార్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఈ కారిడార్‌లో 12 స్టేషన్లు ఉంటాయి. థానె, విరార్, వాపి, సూరత్, వడోదరా, భారుచ్, అహ్మదాబాద్ స్టేషన్ల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది. భారత్ వెస్ట్ కోస్ట్‌లోని ముఖ్యమైన ఆర్థిక, పారిశ్రామిక హబ్‌లను కలిపేందుకే ఈ ప్రాజెక్ట్‌ను కేంద్రం చేపట్టింది.
ఒకేసారి 508 కిమీల దూరం ఓపెన్ చేయకుండా పలు దశల్లో ఈ కారిడార్‌ను రైల్వే శాఖ ఓపెన్ చేయనుంది. తొలి దశలో సూరత్ నుంచి బిలిమొరా వరకు 47 కిమీల దూరాన్ని ముందు ఓపెన్ చేసి ఆ తర్వాత వాపి నుంచి సూరత్‌కి రెండో దశ, మూడో దశలో వాపి నుంచి అహ్మదాబాద్, నాలుగో దశలో థానె నుంచి అహ్మదాబాద్, ఐదో దశలో పూర్తి స్థాయి కారిడార్ ముంబై నుంచి అహ్మదాబాద్‌కి ఓపెన్ కానుంది. అన్ని దశల నిర్మాణం పూర్తయి పూర్తి స్థాయి కారిడార్ ఆపరేషన్స్ 2029 లోపు మొదలవుతాయని రైల్వే శాఖ వెల్లడించింది.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam