AC | ఏసీని కొనాలంటే త్వరపడండి.. త్వరలో భారీగా పెరగనున్న ధరలు..?
AC | ప్రముఖ ఏసీల తయారీ సంస్థ బ్లూస్టార్ ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ధరల పెంపులు తప్పవని సంకేతాలు ఇచ్చింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బి. త్యాగరాజన్ మాట్లాడుతూ ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులు, ముడి సరుకుల ధరల పెరుగుదల, రూపాయి బలహీనత కారణంగా కనీసం మరో 8 శాతం వరకు ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉందన్నారు.
AC | ప్రముఖ ఏసీల తయారీ సంస్థ బ్లూస్టార్ ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ధరల పెంపులు తప్పవని సంకేతాలు ఇచ్చింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బి. త్యాగరాజన్ మాట్లాడుతూ ప్రస్తుత గ్లోబల్ పరిస్థితులు, ముడి సరుకుల ధరల పెరుగుదల, రూపాయి బలహీనత కారణంగా కనీసం మరో 8 శాతం వరకు ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉందన్నారు. కంపెనీ ఇప్పటికే ప్రణాళికలో ఉన్న 13 శాతం ధరల పెంపులో 5 నుంచి 8 శాతం వరకు అమలు చేసిందన్నారు. అయితే గతేడాది మార్జిన్లను కాపాడుకోవాలంటే ఇంకా కనీసం 5 శాతం పెంపు అవసరమని స్పష్టం చేశారు. కాపర్ ధరల పెరుగుదల, పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్ కంపోనెంట్ల ఖర్చు, అలాగే రూపాయి విలువ పడిపోవడం వల్ల తయారీ వ్యయాలు భారీగా పెరిగాయని త్యాగరాజన్ తెలిపారు. అయితే ఈ ధరల పెంపును ఒకేసారి అమలు చేయబోమని కంపెనీ వెల్లడించింది. మే చివరి నాటికి, జూన్‌లో మరో 5 శాతం పెంపు అమలు చేయనుండగా, పండుగల సీజన్‌కు ముందు అదనంగా 3 శాతం ధరలను పెంచాల్సి వస్తుందని చెప్పారు.
అంచనాలకు తగ్గట్లు సేల్స్ లేవు..
ప్రతి నెల, ప్రతి వారం కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, ముడి సరుకుల ఖర్చులు, ఎక్స్చేంజ్ రేట్లు నిరంతరం ఒత్తిడిని పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక సమ్మర్ సీజన్ అమ్మకాల విషయానికి వస్తే, పరిశ్రమ అంచనాలకు తగ్గట్టుగా ప్రైమరీ సేల్స్ జరగలేదని త్యాగరాజన్ అంగీకరించారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ రేటింగ్ మార్పులు, ముందస్తు ధరల పెంపుల భయంతో డీలర్లు ముందుగానే స్టాక్ నిల్వ చేసుకోవడం దీనికి ఒక కారణమని తెలిపారు. ప్రస్తుతం సెకండరీ సేల్స్ మెరుగుపడుతున్నప్పటికీ, కొత్త ఆర్డర్లు పరిశ్రమ ఆశించినంత వేగంగా రావడం లేదన్నారు.
కొనుగోలు సామర్థ్యం దెబ్బ తినే అవకాశం..
పరిస్థితి మరీ అంత దారుణంగా లేదని, కానీ ఇప్పుడు మార్కెట్లు అంత అనుకూలంగా లేవని అన్నారు. ఇక మరింతగా ధరలను పెంచితే వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం దెబ్బ తినే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఇంకా ధరలు పెరిగితే వినియోగదారులు ఖర్చులను తగ్గించుకుంటారని, ఈ స్థాయి పెంపులను మళ్లీ భరించే పరిస్థితి వారికి ఉండదని త్యాగరాజన్ చెప్పారు. అయితే సాధారణంగా ఏదైనా ఒక రంగంలో ఒక సంస్థ ధరలను పెంచితే మిగిలిన కంపెనీలు కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతాయి. అందువల్ల రానున్న రోజుల్లో ఏసీల ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు

Blue Star | గృహోపకరణాల ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన షేర్ల ధరలు..
సెప్టెంబర్ 28, 2026

Tamil OTT | తెలుగులో రిలీజైన తమిళ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ – ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?
సెప్టెంబర్ 10, 2026

Air Conditioners | ఏసీలను ఎంత వాడినా ఈ సూచనలు పాటిస్తే కరెంటు బిల్లు తక్కువగానే వస్తుంది..!
మార్చి 30, 2026
తాజావార్తలు
- ●Supreme Court | లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ ఉండాల్సిందే: సుప్రీంకోర్టు తీర్పు
- ●CM Vijay | శిశువులకు బంగారు ఉంగరం.. మేనమామ కానుక పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్
- ●IRDAI | ఐఆర్డీఏఐ కొత్త ప్రతిపాదనలతో బీమా స్టాక్స్‌పై ఇన్వెస్టర్ల దృష్టి.. ఏ స్టాక్ అయితే బెటర్..?
- ●Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి తొత్తుగా మారారు: మహేశ్‌కుమార్ గౌడ్
- ●Romantic OTT | ఓటీటీలోకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ
- ●Supreme Court on UPI MDR Fee | యూపీఐ లావాదేవీలపై చార్జీలా? ఎవరి లాభం కోసం? కేంద్రం, ఆర్బీఐలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Supreme Court | లోకల్ రిజర్వేషన్‌కు నాలుగేళ్ల రూల్ ఉండాల్సిందే: సుప్రీంకోర్టు తీర్పు

CM Vijay | శిశువులకు బంగారు ఉంగరం.. మేనమామ కానుక పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్

IRDAI | ఐఆర్డీఏఐ కొత్త ప్రతిపాదనలతో బీమా స్టాక్స్‌పై ఇన్వెస్టర్ల దృష్టి.. ఏ స్టాక్ అయితే బెటర్..?

Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి తొత్తుగా మారారు: మహేశ్‌కుమార్ గౌడ్



