త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Assault | భార్య‌పై కోపంతో.. నాలుగేండ్ల‌ కూతురిపై లైంగిక‌దాడి..

Assault | త‌న స్నేహితురాలితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని (Molested) భ‌ర్త‌ను వ‌దిలి పుట్టింటికి వెళ్లింది. అత్త‌గారింటికి వెళ్లి పిల్ల‌ల‌ను త‌న‌తో తీసుకొచ్చిన అత‌డు.. భార్య‌పై కోపంతో త‌న‌ నాలుగేండ్ల కూతురిపై (Daughter) అఘాయిత్యానికి (Assault) ఒడిగ‌ట్టాడు.

G

National | Published On Aug 7, 2026, 12.26 pm IST

Assault | భార్య‌పై కోపంతో.. నాలుగేండ్ల‌ కూతురిపై లైంగిక‌దాడి..
Advertisement

Assault | త్రినేత్ర‌.న్యూస్‌: త‌న స్నేహితురాలితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని (Molested) భ‌ర్త‌ను వ‌దిలి పుట్టింటికి వెళ్లింది. అత్త‌గారింటికి వెళ్లి పిల్ల‌ల‌ను త‌న‌తో తీసుకొచ్చిన అత‌డు.. భార్య‌పై కోపంతో త‌న‌ నాలుగేండ్ల కూతురిపై (Daughter) అఘాయిత్యానికి (Assault) ఒడిగ‌ట్టాడు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని (Gujarat) గాంధీన‌గ‌ర్‌లో జ‌రిగింది.

గాంధీన‌గ‌ర్‌కు (Gandhinagar) చెందిన ఓ మ‌హిళకు కూతురు (4), రెండేండ్ల కుమారుడు ఉన్నారు. వారి ఇంటి స‌మీపంలో ఉంటున్న త‌న స్నేహితురాలిని.. ఆ మ‌హిళ భ‌ర్త (32) గ‌త‌కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఇదే విష‌య‌మై భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వలు జ‌రుగుతున్నాయి. విసిగిపోయిన ఆమె భ‌ర్త‌ను వ‌దిలి, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత అత్త‌గారింటికి వెళ్లిన అత‌డు పిల్ల‌ల‌ను త‌నతో తీసుకెళ్తాన‌ని చెప్పాడు. దీంతో స‌మ‌స్య పెద్ద‌ది కాకుండా ఆమె త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను అత‌నితో పంపించ‌డానికి ఒప్పుకున్నారు.

అయితే అత్త‌గారింటి నుంచి పిల్ల‌ల‌ను త‌న వ‌ద్ద‌కు తీసుకొచ్చుకున్న అత‌డు.. అదే రోజు రాత్రి త‌న ప‌క్క‌నే ప‌డుకుని ఉన్న కూతురిపై లైంగిక దాడి చేశాడు. దీంతో ఆమె గ‌ట్టిగా ఏడ్వడంతో అఘాయితాన్ని ఆపాడు. కాగా, మ‌రుస‌టి రోజు ఆ చిన్నారి అత్త.. ఆమెకి స్నానం చేపిస్తుండ‌గా ర‌క్తం కారుతుండ‌టాన్ని గ‌మ‌నించింది. ఆరా తీయ‌డంతో జ‌రిగిన విష‌యం ఆమెకు చెప్పింది. దీంతో వెంట‌నే త‌ల్లి స‌మాచారం ఇవ్వ‌డంతోపాటు ద‌వాఖాన‌కు తీసుకెళ్లింది. ప‌రీశించిన వైద్యులు లైంగిక దాడి జ‌రిగిన‌ట్లు నిర్ధారించారు. పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో నిందితుడిని అరెస్టు చేశారు. అత‌నిపై పోక్సో (POCSO) కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement